పవన్ కళ్యాణ్ 2014లో పార్టీని పెట్టిన తరువాత రాష్ట్రంలో పోటీ చేయకుండా తెలుగుదేశం, బీజేపీలకు మద్దతు ఇచ్చారు.  ఇది ఆ పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది.  ఆంధ్రప్రదేశ్ కు అనుభవం ఉన్న నాయకుడి అవసరం ఉందని చెప్పి పార్టీని పోటీలోకి దించలేదు.  అలా కాకుండా అప్పుడే పోటీలో ఉన్నట్టయితే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. అప్పట్లో బీజేపీకి, టిడిపికి సపోర్ట్ చేశారు.  


ఆ తరువాత రెండు పార్టీలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు.  రెండు పార్టీలకు దూరంగా ఉంటూ.. ఇద్దరినీ విమర్శించడం మొదలుపెట్టారు.  2019లో పోటీ చేస్తామని చెప్పిన జనసేన పార్టీ అనుకున్నట్టుగానే పోటీ చేశారు.  కానీ, కేవలం ఒక్కసీటు మాత్రమే గెలుచుకుంది.  ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.  ఎందుకంటే, పార్టీని ఐదేళ్లపాటు నడిపించాలి.  పవన్ కు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అన్నది అర్ధంకావడం లేదు.  


ఎందుకంటే, పార్టీని నడిపించాలి అంటే దానికి సత్తా ఉండాలి.  పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు ఆంధ్రప్రదేశ్ కు తిరుగున్నారు.  పార్టీని నిలబెట్టాలి అంటే ప్రజల్లోకి వెళ్ళాలి.  ఇప్పట్లో ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.  ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలి అంటే పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్ళాలి.  పట్టు సాధించాలి. కార్యకర్తలను పెంచుకోవాలి.  ఇవన్నీ పవన్ చేస్తారని ఆ పార్టీ నాయకులే పెద్దగా నమ్మకం కుదరడం లేదు.  


పైగా పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు పవన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.  సినిమాలు చేయాలనీ పట్టుబడుతున్నారు.  సినిమాలు చేయాలకుండా ఉండగలరా అన్నది తెలియాలి.  పవన్ ఒక్కరే ఉంది పార్టీని ముందుకు నడిపించలేరు కాబట్టి పార్టీలోని కీలక నేతలు బీజేపీలో చేరాలని చూస్తున్నారు.  కీలక నాయకులు బీజేపీ తీర్ధం పుచ్చుకుంటే.. పవన్ ఒక్కరే పార్టీలో ఉంటారా.. లేదంటే.. పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: