భూమా కుటుంబానికి రాయలసీమలో ఓ మంచి పేరు ఉన్నది.  ఆ కుటుంబానికి సంబంధించిన ప్రత్యేకంగా ఓటు బ్యాంకు కూడా ఉన్నది.  ఆ కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో విజయం సాధిస్తారు. కాంగ్రెస్, మెగాస్టార్ చిరంజీవి స్థాపించి ప్రజారాజ్యం ఆ తరువాత వైకాపా ఇలా వరసగా పార్టీలు మారారు.  మెగాస్టార్ పార్టీ నుంచి వైకాపాలో జాయిన్ అయ్యాక.. 2014ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేయాల్సి ఉన్నది.  కానీ, అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించారు.  


శోభా నాగిరెడ్డి మరణం తరువాత కొన్ని రోజులకు ఆళ్లగడ్డ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరిగింది.  అయితే, ఈ ఉపఎన్నికలో అఖిలప్రియ ఘనవిజయం సాధించింది.  భూమా నాగిరెడ్డితో కలిసి అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో చేరింది.  టిడిపిలో చేరిన తరువాత ఆమెకు పర్యాటక శాఖ మంత్రి పదవిని ఇచ్చారు.  అయితే, ఇది జరిగిన కొన్నాళ్ళకు భూమా నాగిరెడ్డి కూడా గుండెపోటుతో మరణించారు.  


కాగా, నంద్యాల ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.  భూమా నాగిరెడ్డి కూడా లేకపోవడంతో.. ఆ నంద్యాల సీటును శిల్పా చక్రపాణి రెడ్డి ఆశించారు.  అయితే, అఖిల ప్రియ మాత్రం నంద్యాల సీటును భూమా బ్రహ్మానందరెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టడంతో 2017లో ఉప ఎన్నిక జరిగింది.  నంద్యాల అసెంబ్లీకి జరిగిన ఏ ఉప ఎన్నిక దేశంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మారింది.  రెండు పార్టీలు కోట్లాది రూపాయలు కుమ్మరించాయి. వైఎస్ జగన్ పదిరోజులపాటు అక్కడే ఉండి ప్రచారం చేశారు.  


కానీ, ఉపయోగం లేదు.. భూమా బ్రహ్మానందరెడ్డి దాదాపు 27వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  ఈ విజయంతో భూమా బ్రహ్మానందరెడ్డి ఒక్కసారిగా హీరో అయ్యారు. అయితే, 2019 ఎన్నికల్లో భూమా కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వకూడదు అనుకున్నా.. అఖిల ప్రియ పట్టుబట్టడంతో ఇద్దరికీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. జగన్ ప్రభంజనంలో ఇద్దరు ఓడిపోయారు.  ఇలా ఇద్దరు ఓడిపోవడంతో.. భూమా కుటుంబం పరిస్థితి అయోమయంలో పడిపోయింది.  భూమా బ్రహ్మానందరెడ్డి తన మామ బనగానపల్లె వైకాపా ఎమ్మెల్యే సహాయంతో వైకాపాలో జాయిన్ కావాలని చూస్తున్నారు.  ఇటు అఖిల ప్రియ కూడా వైకాపాలో జాయిన్ కావాలని అనుకుంటోంది.  ఒకవేళ కుదరని పక్షంలో బీజేపీలో జాయిన్ కావాలని అనుకుంటున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: