హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఎలక్షన్స్ రోజురోజుకీ వేడెక్కుతున్నాయి.  హెచ్.సి.ఎ మాజీ అధ్యక్షుడు వివేక్ నామినేషన్ తిరస్కరించడంతో సీన్ మారింది. అజ్జూ భాయ్ కు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. ఎన్నో అడ్డంకులు.. ఆరోపణలు... ఆందోళనల మధ్య జరుగుతున్న ఎన్నికలు  హాట్ టాపిక్ గా మారాయి. 


హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఎలక్షన్‌ హీట్‌ మొదలైంది. నామినేషన్ల ఘట్టం ముగిసింది. టీం ఇండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ ప్యానెల్‌ పోటాపోటీగా నామినేషన్ లు  దాఖలు చేసినా.... వివేక్ నామినేషన్ తిరస్కరణ తో సీన్ మారింది. కోర్టు కేసుల తరుణంలో వివేక్ నామినేషన్ రిజెక్ట్ అవడంతో... ఆల్మోస్ట్ అజ్జు భాయ్ కు లైన్ క్లియర్ అయినట్టే అని కొందరు భావిస్తుంటే... మరికొందరు ప్యానెల్ ఛేంజ్ అవుతున్నారు.


హైదరబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లో ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రెసిడెంట్‌, వైస్‌ప్రెసిడెంట్‌, సెక్రెటరీ, ట్రెజరర్‌ పోస్టులకు ఏకంగా 72 నామినేషన్లు నమోదయ్యాయి.  టీం ఇండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌.. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశాడు. హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్‌ వివేక్‌ నామినేషన్ తిరస్కరించారు. 


226 మంది ఓటర్లున్న హెచ్‌సీఏలో ప్రధాన పోటీ వివేక్‌, అజారుద్దీన్‌ల మధ్యే అని అందరూ ఊహించారు. కానీ వివేక్ నామినేషన్ తిరస్కరించడంతో.. వార్ వన్ సైడయ్యేలా ఉంది. గత ఎన్నికల్లోనే అజారుద్దీన్‌ బరిలో నిలిచినా.. ఎన్నికల అధికారి అతడిపై వేటు వేశాడు. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం మాజీ అంతర్జాతీయ క్రికెటర్‌ హోదాలో అజ్జూ ఈసారి ఎన్నికల బరిలో నిలిచాడు. ప్రెసిడెంట్‌ గా అజారుద్దీన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా విక్రమ్‌ మాన్‌ సింగ్‌, సెక్రెటరీగా అజ్మల్‌ అసద్‌, జాయింట్‌ సెక్రెటరీగా శ్రీనివాస్‌ పట్టపు, మనోహర్‌ రెడ్డి, ట్రెజరర్‌గా శ్రీనివాసరావు, ప్రకాశ్‌ రావు, కౌన్సిలర్‌గా అనురాధ నామినేషన్ లు ఫైల్‌ చేశారు. మరోవైపు మాజీ ఎంపీ, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ పై హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌ కోర్టు అనర్హత వేటు వేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా వివేక్‌ అధ్యక్ష పదవిలో కొనసాగరాదంటూ తీర్పునిచ్చింది.  ప్రస్తుత ఉపాధ్యక్షుడు అనిల్‌ అధ్యక్షుడి గా నామినేషన్ వేసినా... ప్రభావం నిల్. హెచ్‌.సి.ఎ మెంబర్‌, మాజీ క్రికెటర్‌ శివలాల్‌ యాదవ్‌ సపరేట్‌గా ప్యానెల్‌ పెట్టుకుని.. నామినేషన్‌ దాఖలు చేసేందుకు పావులు కదిపినా... అజ్జూ భాయ్ బుజ్జగించాడు. శివలాల్ నామినేషన్ వేయకుండా జాగ్రత్త పడ్డాడు. 


ఎన్నో అవినీతి ఆరోపణలు, పరస్పర తగాదాలు, అడ్డంకులు.. మధ్య... జరుగుతున్న ఎన్నికలు కావడంతో హాట్‌హాట్‌గా మారినా... ఒక్క నామినేషన్ రిజెక్ట్ తో సీన్ మారింది. పోటీనే లేదు... అజ్జూ భాయ్... హెచ్.సి.ఎ డాన్ అంటున్నారంతా. ఏం జరుగుతుందో ఈ నెల 27దాకా వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: