మై విలేజ్ షో లో నటించి యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన గంగవ్వ కొడుకు రాజారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయగా గమనించిన గ్రామస్తులు రాజారెడ్డి ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విషయం తెలుసుకున్న గంగవ్వ హుటాహుటీన జగిత్యాల ఆసుపత్రికి చేరుకుంది. అయితే గంగవ్వ కొడుకు రాజా రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ టానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. కాగా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ పల్లెటూరి యాసతో ప్రపంచం చూపు తన వైపు మళ్లేలా చేసింది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని లంబాడి పల్లి కి చెందిన ఒకప్పుడు దినసరి కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే జగిత్యాలకు చెందిన కొందరు యువకులు మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ కామెడీ వీడియోలు చేయగా అందులో గంగవ్వ నటించింది. అయితే ఈ వీడియోలో గంగవ్వ నటన అందరినీ ఆకట్టుకుంది. అచ్చమైన తెలంగాణ యాస... పల్లెటూరి అమాయకత్వం అందర్నీ కట్టిపడేసింది. మై విలేజ్ షో లో నటించిన గంగవ్వ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
కనుమరుగవుతున్న పల్లెటూరు మాటలను పల్లెటూరి సంప్రదాయాన్ని చూపించే గంగవ్వ నటన అందరినీ ఆకర్షించటంతో ఆమె వీడియోలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే మై విలేజ్ షో తో తన నటన స్టార్ట్ చేసిన గంగవ్వ ఈ మధ్య సినిమాలలో కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన మల్లేశం ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమాలలో గంగవ్వ నటన అందరినీ ఆకట్టుకుంది.