పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లలో సంచలనం నమోదైంది. గతంలో పోలవరంలోని హైడల్ ప్రాజెక్టు పనులకు నవయుగ సంస్ధ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పనులకు సంబంధించి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావించింది. దాంతో రివర్స్ టెండరింగ్ విధానానికి తెరలేపింది.

 

గతంలో నవయుగ కంపెనీ చేసిన పనులను చంద్రబాబు రూ. 4987 కోట్లకు కట్టబెట్టారు. అంటే అప్పట్లోనే నవయుగ కంపెనీ సుమారు 4.8 శాతం ఎక్సెస్ తో టెండర్లు దక్కించుకుంది. అయితే తాజాగా పిలిచిన రివర్స్ టెండర్లలో మెగా కంపెనీ అదే పనిని అంటే హెడ్ వర్క్స్, జల విద్యుత్ కేంద్రం పనులను 4359 కోట్లకే చేస్తానని ముందుకొచ్చింది. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల సుమారు 12.6  శాతం తక్కువకే పనులు జరగనున్నాయి.  మొత్తానికి రూ. 782 కోట్ల ప్రజాధనం ఆదాచేసినట్లు అయ్యింది.

 

ఒకవైపు కేంద్రప్రభుత్వం మరోవైపు పోలవరం ప్రాజెక్టు అథారిటితో పాటు చంద్రబాబు లాంటి వాళ్ళు ఎంతగా వ్యతిరేకిస్తున్న జగన్ పట్టుబట్టి రివర్స్ టెండర్లకు వెళ్ళటం వల్ల ప్రభుత్వానికి భారీగానే లాభం కనబడింది. ప్రభుత్వం మీద భారం తగ్గటమంటే ఆ మేరకు ఆదాయం వచ్చినట్లే కదా ?

 

నవయుగ కంపెనీతో పోల్చుకుంటే మేఘా ఇన్ ఫ్రా సంస్ధకు మంచిపేరుంది. పైగా తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తి చేసిన ఘనత కూడా మేఘా కంపెనీకి దక్కుతుంది. జగన్ పట్టుబట్టినందుకు రివర్స్ టెండర్ గ్రాండ్ సక్సెస్ అయినట్లే అనుకోవాలి.

 

ఇన్ని రోజులు జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేసిన చంద్రబాబు అండ్ కో ఇపుడేమంటారో చూడాలి. అంటే ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయ విమర్శలను చేసే వాళ్ళను ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదు.  మొత్తం మీద రివర్స్ టెండర్లు జరిగిన రెండు పనుల్లోను ప్రజాధనం బాగానే ఆదా అయ్యిందంటే ఈ మేరకు చంద్రబాబు ఏ స్ధాయిలో అవినీతికి పాల్పడ్డారో అందరికీ అర్ధమవుతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: