డ్రైవర్ ఎంత గొప్ప వాడు అంటే తన ప్రాణాలనే కాదు తను నడుపుతున్న వాహనంలో ఉన్న అందరి ప్రాణాలను కాపాడుతుంటారు . ఎక్కడైకైనా  జర్నీకి వెళ్లాలనుకుంటే బస్సులను ట్రైన్, విమానంలో  వెళ్లాలి. దేంట్లో  వెళ్లాలన్న మనం వెళుతున్న వాహనానికి  డ్రైవర్ మాత్రం కంపల్సరి. మనందరి ప్రాణాలని డ్రైవర్  చేతిలో పెట్టి మన నిశ్చింతగా ఉంటాం . మనిషి ప్రాణం విషయంలో దేవుడైన నమ్ముతాడో  లేదో తెలియదు కానీ.... మనం ప్రయాణిస్తున్న వాహనాన్ని నడిపే డ్రైవర్ ని మాత్రం బాగా నమ్ముతారు. అయితే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది డ్రైవర్ల తమ ప్రాణాలకు తెగించి ప్రయాణికుల ప్రాణాలు రక్షిస్తుస్తారు. వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలను తమ బాధ్యతగా తీసుకుంటారు కొంత మంది డ్రైవర్లు. అయితే డ్రైవర్లు తమ ప్రాణాలు పోతున్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఇప్పుడు  జరిగిన సంఘటన కూడా అలాంటిదే. 

 

 బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు సాఫీగా  ప్రయాణం సాగుతుంది . అకస్మాత్తుగా ఆ డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. దీంతో తన ప్రాణాలు పోతున్నాయి అని తెలిసినా ప్రయాణికుల ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడ్డాడు ఆ డ్రైవర్. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో   చోటుచేసుకుంది. ధనజోడు   నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చాలా మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే బస్సు అక్కవరం దగ్గరకు వచ్చేసరికి డ్రైవర్ జోగేందర్ శెట్టి  చ అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. అయినా తన ప్రాణాలను లెక్క చేయలేదు డ్రైవర్. ఓ వైపు గుండెపోటు వచ్చినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. బస్సును పొలాల్లోకి తీసుకెళ్లి అక్కడే ప్రాణాలు విడిచారు. 

 

 

 దీంతో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినప్పటికీ ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు  అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డ ప్రయాణికులను  ఆసుపత్రికి తరలించారు. కాగా డ్రైవర్ కి  గుండెపోటు వచ్చినప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి తమ   ప్రాణాలను కాపాడి డ్రైవర్  ప్రాణాలను కోల్పోయాడని ... డ్రైవర్ కారణంగానే తమ ప్రాణాలకు ముప్పు తప్పిందని ప్రయాణికులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: