ఈమధ్యకాలంలో ఎస్వీయూ విద్యా వ్యవహారాలపై మునుపెన్నడూ లేనంతగా విస్తృతంగా చర్చ,విమర్శల పరంపర కొనసాగుతుండటం నిజంగా ఆందోళన కలిగించే విషయం.ఈ మద్య జరుగుతున్న సంఘటనలు కొన్ని ఎస్వీయూ ను కించ పరిచే విధంగా వుండటం పట్ల పలువురు విచారణ వ్యక్తం చేస్తున్నారు.ఈ సమాజంలో ప్రత్యేకించి ఆలయాలంటు ఉన్నాయంటే అవి విశ్వవిద్యాలయాలే.ఆ ఆలయాల్లో దేవుడు రాయిరూపంలో వుంటే విశ్వవిద్యాలయాల్లో అద్యాపకుల రూపంలో కనిపిస్తారు. అందుకే ఇక్కడ జీవితం దొరుకుతుందని నమ్మే వారిలో విద్యార్ధులు ముందు వరుసలో వుంటారు.....



ఐతే ఎస్వీయూ ను ఆలయంగా భావించే అందరికి వికలాంగుడిని మానసికంగా ఇబ్బంది పెట్టిన సంఘటన అదీ రిజిస్ట్రార్ ఆఫీస్ లోనే జరగడం నిజంగా ఆందోళనకు గురిచేస్తుంది.సమాజాన్ని తీర్చిదిద్దే వ్యక్తులే తప్పులు చేస్తే ఇక నవసమాజ నిర్మాణం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు కొందరు..? ఈ మధ్యకాలంలో విశ్వవిద్యాలయాల కు చీడ పట్టినట్లు వుందని అభిప్రాయ పడుతున్నారు కొందరు.పంట పోలాలకు చీడపడితే మందులున్నాయి,మరి విశ్వవిద్యాలయాల్లో మనుషుల రూపంలో వున్న చీడను ఎలా పారదోలాలి.వాటికోసం ఎలాంటి స్ప్రేలు వాడాలి.వారి మనసుల్లో,వారిచేతల్లో,వారి మాటల్లో వున్న వైరెస్‌ను తొలగించడం ఎలా....



అక్షర జ్ఞానం లేని వాడు మానసిక దౌర్బల్యం గల వాడైతే సమాజానికి జరిగే కీడు అంతగా ఉండదు.చదువుకున్న అజ్ఞానుల వల్లనే పండిత మూడుల వల్లనే సమాజానికి ప్రమాదం ఎక్కువ.ఇప్పుడు ఎస్వీయూ లో జరిగే ఘటనలు ఇలాగే వున్నాయి.ఇక్కడ చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్తుకు సంకెళ్లు వేస్తే పుట్టగతులు ఉండవనే విషయాన్ని పాలకులు గుర్తించాలి. పాముకి పాలుపోస్తే ఏమవుతుందో, అవినీతి,వ్యవస్దను పెంచిపోషిస్తే అదే జరుగుతుందని తెలుసుకోవాలి.విద్యారంగమంటే సరదాగా ఆడుకోవడానికి చదరంగం కాదు.చదరంగంలాంటి జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనను కలిగించేదే.దయచేసి ఎస్వీయూ విషయంలో స్పందించండి,విద్యార్ధులకు న్యాయం జరిగేలా చూడండని అని గొంతులు పగిలేలా అరిచిన  వారి గోడు పట్టించుకునే వారు లేరని బాదపడుతున్నారట విద్యార్ధులు..  


మరింత సమాచారం తెలుసుకోండి: