దేశంలోని ఉన్నతమైన  యూనివర్సిటీల్లో ఆంధ్రప్రదేశ్  లోని  శ్రీ వెంకటేశ్వర యూనివర్సీటి ఒకటి..  అందులో సీటు దొరికితే చాలు లైఫ్ సెటిల్ అయిపోయిందుంది అనేలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఆ యూనివర్సిటీ.  అయితే ఇటీవల జరిగిన  ఓ సంఘటన  మొత్తం  యూనివర్సటీ పరువును రోడ్డున పడేసింది.  ఇంతకీ ఆ ఘటన ఏంటేంటే... వికలాంగులను చూస్తే మనం జాలి కలుగుతుంది. వారితో  గౌరవంగా మాట్లాడుతాం.. అవసరమైతే  వారి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. వారికీ వచ్చిన కష్టం ఎవరికి రావొద్దని  అనుకుంటాం. అయితే సాక్ష్యాత్తు  విధ్య కు నిలయమైన   ఎస్వీ యూనివర్సీటీ లో నే ఓ వికలాంగుడిని ఘోరంగా  అవమానించారు.  




ఇంతకీ ఏ జరిగిందంటే  ఎస్వీ యూనివర్సిటీ కి సాంకేతిక  సహాయం  అందిస్తున్న ఓ కార్పొరేట్  సంస్థ  కు ఆ వికలాంగుడు  ప్రతినిధి గా వ్యవహరిస్తున్నాడు.   అయితే   యూనివర్సిటీ సంస్థ కు  బకాయి పడింది. దాంతో పెండింగ్ బిల్లులకోసం  ఆప్రతినిధి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్ళాడు.  అయితే అక్కడేవున్న సిబ్బంది   30నిమిషాలు   అతన్ని  ఆ గదిలో నిర్బదించి  అతనిపై  మాటలదాడికి  దిగారు.  ఆ వికలాంగుడు బయటకు రావాలని ప్రయత్నించినా సిబ్బంది అతన్ని   బయటకు రానీయకుండా చేశారు.  అంతేకాకుండా బలవంతంగా  అతని దగ్గరి నుండి సంతకాలు కూడా సేకరించారు.ఈతతంగం అంతా  ఇంచార్జ్ రిజిస్ట్రార్  ముందే జరిగింది.  



 దాంతో ఈఘటనలో  రిజిస్ట్రార్ పాత్ర ఉందని అనేక అనుమానులు  వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఘటన జరిగి  10రోజులు అవుతున్న  యూనిర్సిటీ  ఇంచార్జ్  రిజిస్ట్రార్  తన తీరు మార్చుకోకుండా  వ్యవహరిస్తుండడం  ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.  మరి ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ వికలాంగుడికి  న్యాయం చేస్తుందో లేదో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: