పాక్ భూభాగంలో 1947 స్వాతంత్రం నాటికి మైనారిటీలు - అల్ప సంఖ్యాక వర్గాలు 23 శాతం ఉండగా, నేడు వారి సంఖ్య 3 శాతం మాత్రమే. ఏ దేశంలో నైనా జనాభా సంఖ్య కాలంతో పాటు శాతాల్లో వైరుద్యమున్నా పెరుగుదల నమోదౌతుంది తప్ప మరీ ఈ స్థాయికి తరిగిపోదు. 


ఒక ప్రక్క పాక్ సైన్యం, ప్రభుత్వ వత్తాసుతో క్రైస్తవులు, సిక్కులు, అహమ్మదీయులు, హిందువులు, షియాలు, పష్తూన్లు, సింధీలు, బలోచీలు మొదలైన మైనారిటీ ప్రజలపై నీచాతి నీచమైన దుర్మార్గమైన క్రూరమైన దైవ దూషణ చట్టాలను రూపొందించి వాటిని దారుణంగా అమలు చేస్తూ వారిని మానసికంగానే కాదు భౌతికంగానూ హింసిస్తూ వచ్చింది. దీనికి తోడు బలవంతపు మత మార్పిడులకు పాల్పడింది పాక్.  ఐఖ్య రాజ్య సమితి జనరల్ అస్సెంబ్లీలో మానవ హక్కుల హననాన్ని గుఱించి తీవ్ర వేదన పడుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త అవతారాన్ని చూస్తుంటే హిమాలయాల్లో అంతరించి పోతున్న కొండగొర్రెను వేటాడే వేటగాడిని తలపిస్తోంది.


మానవ హతకులు, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేటి శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం తగరని - 'పాక్‌ మహిళా హక్కుల కార్యకర్త గులాలయీ ఇస్మాయిల్‌' కు ఆమె కుటుంబానికి జరిగిన అన్యాయమే ఋజువని చెప్పక తప్పదు. పాక్ ప్రభుత్వం వత్తాసుతో మైనార్టీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తమ సైన్యం ఇప్పట్నుంచైనా ఆగడాలకు చరమగీతం పాడాలని పాక్‌ మహిళా హక్కుల కార్యకర్త గులాలయీ ఇస్మాయిల్‌ - నేతృత్వంలో వందలాది మంది ఐక్యరాజ్యసమితి ఎదుట పాక్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


అమాయక మైనార్టీలపై ఉగ్రవాదులుగా ముద్రవేసి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారంటూ సైన్యం దురాగతాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ లో తనకు రక్షణ లేదని అక్కడి పరిస్థితులను బట్టి గ్రహించి గులాలయీ ఇస్మాయిల్‌ - ప్రస్తుతం అమెరికాలో రాజకీయంగా ఆశ్రయం కల్పించాలంటూ ఆమె అగ్రరాజ్యాన్ని శరణువేడుకుని అక్కడ తల దాచుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఉపన్యసిస్తున్న వేళ - గులాలయీ ఇస్మాయిల్ నాయకత్వంలో వందలాది మంది మహిళా హక్కుల కార్యకర్తలతో ఐరాస ఎదుట పాక్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


“నో మోర్‌ బ్లాంక్‌ చెక్స్‌ ఫర్‌ పాకిస్తాన్, ఆర్మీ స్టాప్‌ మెడ్డింగ్ ఇన్‌ పాలిటిక్స్‌” అనే నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. (దానర్ధం - పాక్‌ కు బ్లాంక్‌ చెక్కులు నిలిపివేయాలి రాజకీయాల్లో పాక్‌ సైన్యం జోక్యం నిలిపివేయాలి) ఈ సందర్భంగా గులాలయీ మాట్లాడుతూ, ‘పస్తూన్లు, బలూచీలు, సింధీలపై ఉగ్రవాదుల ముద్రవేసి వారి ఏరివేత పేరిట పాక్ అమాయక మైనారిటీ పౌరులను అక్రమంగా బందించి హతమారుస్తోంది. అంతేకాదు సైన్యం అక్కడ వారిపై అత్యంత హేయమైన దాడు లకు పాల్పడుతోంది.


పాక్‌ సైన్యం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన నేఱాలకు పాల్పడకుండా ఉండాలన్న మా డిమాండ్‌ ను అంగీకరించాలని నినదించారు. “టార్చర్‌ సెంటర్ల” లో ఉన్న మైనార్టీలను తక్షణం విడుదల చేయాలని కోరారు.  ఖైబర్‌ ఫంక్తువా ప్రావిన్స్‌ లో తిష్ట వేసిన పాక్ సైన్యం  నియంతృత్వ పూరితంగా తమని ప్రశ్నిస్తున్న వారిని మాత్రమే ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ తమకు నచ్చినట్లు వారిపై దుర్మార్గంగా దాడులకు తెగబడుతోంది’ అని మైనార్టీల పట్ల పాక్‌ సైన్యం ప్రవర్తిస్తున్న తీరును ఆమె ఎండగట్టారు.


“పాక్‌ సైన్యం దుర్మార్గాలను, దురాగతాలను పలుమార్లు ఎత్తి చూపినందుకు నాపై వాళ్లు పగబట్టారు. వాళ్ళకు వ్యతిరేకంగా తను నినదించినందుకు అణచివేయాలని ప్రయత్నించారు. నా కుటుంబ సభ్యులను బెదిరించి తీవ్ర వేదనకు గురిచేసైనా వారిని తన దారిలోకి తెచ్చు కోవాలని చూశారు. కాని ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు నాకు పూర్తిగా  మద్దతు నిచ్చారు. ఇది సహించని పాక్‌ సైన్యాధికారులు, మా నాన్న, మా సోదరుడిపై అక్రమ కేసులు బనాయించి చెరసాల పాల్జేశారు. కొందరి సహాయంతో నేను తప్పించుకుని ప్రస్తుతం ఇక్కడ (అమెరికాలో) ఆశ్రయం పొందుతున్నాను” అని తను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరించారు.


మైనార్టీ మహిళలపై పాక్‌ సైన్యం దురాగతాలకు, లైంగిక దాడులకు పాల్పడుతుందని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా గులాలయీ ఇస్మాయిల్‌ ప్రపంచానికి పాక్‌ సైన్యం దురాగతాలను తెలిపారు.  ఆజ్ఞాతం నుండి బయటకు వచ్చారు. సంప్రదాయ పస్తూన్‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆమె పై పాక్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో దేశద్రోహానికి పాల్పడుతున్న గులాలయీ ఇస్మాయిల్‌ ని అదుపులోకి తీసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సింది గా పాక్‌ సైన్యం ఇస్లామాబాద్‌ హైకోర్టు ను ఆశ్రయించింది.


ఈ నేపథ్యంలో పాక్‌ సైన్యం పిటిషన్‌ ను గులాలయీ ఇస్మాయిల్‌ సవాలు చేయడంతో ఆమెకు హైకోర్టులో ఊరట లభించింది. అనంతరం ఆమె అమెరికా చేరుకుని ప్రస్తుతం తన సోదరితో అక్కడే నివసిస్తున్నారు.

Image result for gulalai ismail harrased by Pak 

మరింత సమాచారం తెలుసుకోండి: