టీవీ9 జాఫర్...తనదైన శైలిలో రాజకీయ నేతలని ఇంటర్వ్యూలు చేసి పేరు తెచ్చుకున్న యాంకర్. ఆయన చేసిన ఇంటర్వ్యూల వల్ల టీవీ9కు మంచి టీఆర్పీ రేటింగ్స్ కూడా వచ్చాయి. అయితే అంతలా టీవీ9 కోసం కృషి చేసిన జాఫర్ ని హఠాత్తుగా సంస్థ నుంచి తొలగించారు. ఇలా ఉన్నట్టుండి జాఫర్ ని తొలగించడానికి కారణాలు లేకపోలేదు. జాఫర్ టీవీ9 మాజీ సి‌ఈ‌ఓ రవి ప్రకాష్ సన్నిహిత వ్యక్తి అన్న విషయం తెలిసిందే.


ఇటీవల టీవీ9 ఛానల్ లో పలు ఆర్ధిక అవతవకలకు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రవి ప్రకాష్ ని సి‌ఈ‌ఓ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే చానల్‌ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై రవి ప్రకాష్ మీద కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం రవి ప్రకాష్ మీద విచారణ జరుగుతుంది. ఈ సందర్భంలో టీవీ చానల్ ని అలంద మీడియా టేకోవర్ చేసింది. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు టీవీ9 ఉద్యోగులని తొలగించారు.


అయితే జాఫర్ ని మాత్రం అలాగే కొనసాగించింది. కానీ తాజాగా జాఫర్ రవి ప్రకాష్ ని కలిసినట్లు తెలుస్తోంది. పైగా రవి ప్రకాష్ దక్షిణాదిలో కొత్త న్యూస్ చానళ్ళని ప్రారంభిస్తున్నారనే ప్రచారం ఉంది. జాఫర్ కూడా అందులోకి వెళ్లిపోవచ్చని తెలిసింది. దీంతో టీవీ9 యజమాన్యం ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. రవి ప్రకాష్ ని కలిశారన్న ఆరోపణల్ని ఆధారంగా చేసుకుని జాఫర్ చేత రాజీనామా చేయించారు. ఆ విధంగా జాఫర్ టీవీ9 నుంచి బయటకెళ్ళాల్సి వచ్చింది.


కాగా, జాఫర్ ఇటీవల బిగ్ బాస్ షో లోకి వెళ్ళి కొన్ని రోజులు సందడి చేసిన విషయం తెలిసిందే. సరైన ప్రదర్శన చేయకపోవడం వల్ల ఆయన షో రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: