రంకు నేర్చిన‌మ్మకు బొంకుడు రాదా అనేది ఓ మోటు సామేత‌. ఇది అక్ష‌రాల టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ప‌క్కాగా వ‌ర్తిస్తుంద‌నుట‌లో ఏలాంటి సందేహం లేదు. అధికారం చేప‌ట్టిన‌ప్పటి నుంచి ఐదేండ్లు ప‌రిపాల‌న చేసిన చంద్ర‌బాబు నాయుడు గ‌త చ‌రిత్ర చూస్తే అంతా రంకు బొంకు వ్య‌వ‌హ‌రాల‌తోనే సాగింద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. చంద్రబాబు నాయుడు జీవిత‌మే ఓ అబ‌ద్దాల మ‌యం అనేందుకు పిల్ల‌నిచ్చిన మామ, దివంగ‌త సీఎం ఎన్టీఆర్ ఏనాడో చెప్పాడు.


అంతే కాదు తాను  చేసిన ప‌నుల‌ను గొప్ప‌గా చెప్పుకోవ‌డం, ఇత‌రులు చేసిన ప‌నుల‌ను త‌ప్పుగా చెప్పి ప్ర‌పంచాన్ని న‌మ్మించ‌డంలో చంద్రాలును మించినోల్లు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఇప్పుడు అస‌లు విష‌యానికి వ‌స్తే చంద్రాలు తాను ప‌రిపాల‌న చేసిన‌ప్పుడు చేసిన త‌ప్పుడు నిర్ణ‌యాలు, త‌ప్పుడు ప‌నులు ఇప్పుడు కొత్తగా వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం పై  నెట్టెసీ తాను మాత్రం సచ్ఛిలుడుగా తెగ బిల్డ‌ఫ్ ఇస్తూ పోజు కొడుతున్నాడు.


ఏపీ సీఎం జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న ప‌రిపాల‌న‌లో అన్ని లోపాలే అంటూ ఆరోప‌ణ‌లు చేస్తూ ప‌బ్బం గడుపుకుంటున్నాడు చంద్రాలు. అయితే విద్యుత్ లో లోపాలు, కోత‌లు, స‌మ‌స్య‌ల‌ను పెద్ద‌విగా చేసి తాను అధికారంలో ఉన్న‌ప్పుడు ఇలా లేదే అని విమ‌ర్శ‌లు చేస్తూ రాక్ష‌సానందం పొందుతున్నాడు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేట‌ప్ప‌టికే చంద్రాలు దాదాపుగా రూ.20వేల కోట్ల అప్పుల కుప్ప‌లు చేసి జ‌గ‌న్ నెత్తిన గుదిబండ‌ను మోపాడు. ఇప్పుడు నాకేమి తెలియ‌దు అని నంగ‌నాచిలా ఆరోపిస్తున్నాడు.


ఇక అధికారంలో ఉన్న‌ప్పుడు వ్య‌వ‌సాయానికి కేవ‌లం 7గంట‌లు ఇచ్చిన విద్యుత్ ను సీఎం జ‌గ‌న్ 9గంట‌లు చేస్తే అది కూడా ఇవ్వ‌డం చేత‌కావ‌డం లేద‌ని వ్యంగంగా ఆరోప‌ణ‌లు చేస్తున్న చంద్రాలుకు విద్యుత్‌ను స‌మ‌స్య‌కు తాను కార‌ణమ‌న్న విషయం తెలియ‌నిదా.. విద్యుత్ ఒప్పందాల్లో చేసిన అవినీతిని ఎక్క‌డ బ‌య‌ట‌పెడుతాడోన‌నే భ‌యంతో ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు రివ‌ర్స్ ప‌రిపాల‌న అంటూ తెగ హ‌డావుడి చేస్తున్నాడు చంద్రాలు. చేసేది తప్పులు.. చెప్పేది నీతులు అంటే ఇదే బాబోరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: