తెలంగాణ ఎన్నిక‌లల్లో చంద్ర‌బాబు చేసిన ప‌నికి ప్ర‌తిఫలంగా భారీ రిట‌ర్న్ గిప్ట్ ఇస్తామ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించి, తాను అనుకున్న‌ట్లే ఏపీ ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందెలా ఎత్తులు వేసి చంద్రాలును చిత్తు చేసేలా వైఎస్ జ‌గ‌న్‌కు అండ‌దండా అందించాడ‌నే ప్ర‌చారం ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో ఉప ఎన్నిక అనివార్యం అయింది.. హుజూర్‌న‌గ‌ర్ ఉప పోరులో టీ ఆర్ ఎస్ అభ్య‌ర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకుని పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డికి దిమ్మ‌తిరిగే షాక్ ఇవ్వాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎత్తులు వేస్తున్నాడు.


అయితే ఈ ఉప ఎన్నిక‌లో ఏపీ సీఎం జ‌గ‌న్ సాయం తీసుకునేందుకు కేసీఆర్ ఎత్తులు వేశాడ‌ట‌.. అందుకు కేసీఆర్ కోరిక మేర‌కు ఉడ‌తాభక్తిగా సాయం చేసేందుకు జ‌గ‌న్ కూడా స‌రేన‌న్నార‌ట‌.. అందుకు కేసీఆర్ వేసిన ఎత్తు ఏంటి.. జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న ఆ ఎత్తుగ‌డ ఏంటీ అంటే.. ఏపీకి బార్డ‌ర్‌గా ఉన్న తెలంగాణ నియోజ‌కవ‌ర్గం హుజూర్ న‌గ‌ర్‌. అయితే ఇక్క‌డ ఎక్కువ‌గా ఏపీకి చెందిన క‌మ్మ‌, కాపు ప్ర‌జ‌లు వ‌ల‌సొచ్చి నివాసం ఉంటున్నారు. వీరిని త‌మ బుట్ట‌లో వేసుకోవాలంటే అందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ సాయం చేయాలి.. అందుకు ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేల చేత ప్ర‌చారం చేయించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు.


క‌మ్మ‌లకు ఇక్క‌డ 11వేల ఓట్లు, కాపులు 7వేల ఓట్లు ఉన్నాయ‌ట‌.. ఇక రెడ్డి వ‌ర్గం ఓట్లు కూడా 27 వేలు ఉన్నాయి. అంటే ఈ ఓట్ల‌ను గంప‌గుత్త‌గా టీ ఆర్ ఎస్‌కు ప‌డేలా ఏపీలోని ఎమ్మెల్యేలు ఇక్క‌డ ప్ర‌చారం చేస్తే మేల‌ని కేసీఆర్ జ‌గ‌న్‌కు సూచించ‌డం, అందుకు జ‌గ‌న్ ఓకే చెప్ప‌డం, ద‌స‌రా త‌రువాత ఏపీ ఎమ్మెల్యేలు ఇక్క‌డ ప్ర‌చారంలోకి దిగ‌డం ఖాయ‌మేన‌ట‌.. ఓవైపు జ‌గ‌న్ తోడుతో పాటుగా ఇప్ప‌టికే సీపీఐతోనూ మంత‌నాలు జ‌రిపి వారిని మ‌ద్ద‌తుకు ఒప్పించి కేసీఆర్ స‌క్సెస్ అయ్యారు. అంటే అటు వైసీపీ, ఇటు సీపీఐ మ‌ద్ద‌తుతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలుపుకు బాట‌లు వేసుకుంటున్నారు కేసీఆర్‌.. 


మరింత సమాచారం తెలుసుకోండి: