ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. దీంతో ఇక నవరత్నాలు అందరికీ అందుతాయంటున్నారు వైసీపీ నేతలు.. ప్రతి గడపకు నవరత్నాలు తీసుకెళ్లేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఓర్వలేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.


ప్రతి ఒక్కరూ సీఎం ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు.గ్రామ స్వరాజ్య పాలనే లక్ష్యంగా గ్రామ సచివాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వార్డు సచివాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. గతంలో పరిపాలన చూశామన్నారు. ఏదైనా సంక్షేమ పథకాలు కావాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు.


వైఎస్‌ జగన్‌ 3468 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశారని, ఈ వ్యవస్థను పటిష్టపరిచేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్నికల ప్రణాళికలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని చెప్పారు. నవరత్న పథకాలను గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా డోర్‌ డెలివరీ చేస్తామన్నారు.


గ్రామ సచివాలయ వ్యవస్థ ఓ మైలు రాయి అని మరో మంత్రి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిదే అని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అయితే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పని చేస్తుందనే అంశంపైనే తుది ఫలితాలు ఆధాపపడి ఉంటాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..


మరింత సమాచారం తెలుసుకోండి: