ఇటీవల  ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి అందరికి  తెలిసిందే. అయితే ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ లో చాల  సంచలనం సృష్టించింది కూడా. అయితే ఈ విషయాన్నీ మాత్రం  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయంగా చాలా వాడుకున్నాడు.

కోడెల మరణం తన రాజకీయ భవిష్యత్తు కి బాగా ఉపయోగ పడుతుందనే ఉద్దేశంతో తీవ్రమైన విమర్శలు కూడా చేయడం మొదలు పెట్టారు. అయితే ఆయన్ని గత కొద్దీ రోజులుగా పాటించుకొని చంద్రబాబు నాయుడు, కోడెల మరణించాక ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు తీవ్రమైన విమర్శలు చేశారు.

ఇక కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత నుంచి  ఇప్పటి వరుకు  కూడా టీడీపీ అధినేత చంద్రబాబు మాట ఒకే ఒక్కటే… కోడెల ని వైసీపీ ప్రభుత్వ నేతలు అనవసరంగా పొట్టన పెట్టుకున్నారు అని అంటూ మాన్పడిపోతున్నాడు. అయితే ఈ విషయం మీద వైసీపీ నేతలు కూడా చాలా గట్టిగానే సమాధానం ఇచ్చారు. నిజానికి  కోడెల మరణం అనేది చాలా బాధకారమైన విషయం అని తెలియచేసిన వైసీపీ ఆ తరువాత టీడీపీ చేస్తున్న విమర్శలపై చాలా గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఈమేరకు చంద్రబాబు కి ఒక లేఖ కూడా రాసారు.

అందులో… ” ఆంధ్ర ప్రదేశ్ లో  వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు జరగకుండా  అడ్డు కట్ట వేయాలనే  ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు బయటికితీస్తున్నారు. ఇకపోతే మీ బాధ్యత రాహిత్యం వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఫ్యాక్షనిస్టుని ఐనా శివప్రసాదరావు మహానాయకుడిగా చంపించడం మీకు సిగ్గుచేటు కాదా ?.. అని వైసీపీ నేతలు ప్రశ్నించారు .అయితే వైసీపీ చేసిన ఈ వాఖ్యలు ఇపుడు చాల  చర్చిన విషయం గా  మారింది. ఆత్మహత్య చేసుకొని మరణించిన కోడెల ని వైసీపీ నేతలు ఫ్యాక్షనిస్టు అనడం పలు వివాదలకు కూడా  దారీ తీస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: