ఈఎస్‌ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కార్మిక వైద్య భీమా సేవల సంస్ధ తెలంగాణాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విభాగం అధికారులు, కొంతమంది సిబ్బంది, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కలిసి భారీగా డబ్బులు దండుకున్నట్లు అధికారులు గుర్తించారు.               


గడిచిన నాలుగు సంవత్సరాలలో ఏడాదికి 250 కోట్ల రూపాయిలు చొప్పున నాలుగేళ్లలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయిల మేర ఔషదాల కొనుగోళ్లు చేసినట్లు అధికారుల విచారణలో తెలిసింది. ఈ స్కాంకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 70 డిస్పెన్సరీల వివరాలు సేకరించారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు.                      


కాగా ఈ స్కాంకు సంబంధించి మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పలు మెడికల్‌ ఏజెన్సీ కార్యాలయాల్లో కూడా ఇప్పటికీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓమ్ని మేడి ఉద్యోగి నాగరాజు ఇంట్లో 46 కోట్ల విలువైన నకిలీ ఇండెంట్లను అనిశా అధికారులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ విషయానికి సంబంధించని పలువురు ఈఎస్‌ఐ ఉద్యోగుల సంతకాలను సైతం సేకరించారు. అయితే మరో రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన మరికొంతమందిని అధికారులు అరెస్ట్ చేసేకి రంగం సిద్ధం చేస్తున్నారు.                 

                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: