తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీ వల్ల ఎలాంటి లాభం లేదని, దీని కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బు అంత వృథా అవుతోందని వీకే సింగ్ హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


నేషనల్ పోలీస్ తెలంగాణ పోలీస్ అకాడమీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అనవసరంగా దీని కోసం ప్రభుత్వం డబ్బు వృథా అవుతోందని, నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు ప్రవర్తన సరిగ్గా లేదని వీక్ సింగ్ తప్పుబట్టారు. జైల్‌లో ఉన్నవారు 90 శాతంమంది పేదవారేనని, తినడానికి తిండి కూడా లేనివారే జైళ్లలో మగ్గుతున్నారని ఆయన పేర్కొన్నారు. 


మరికొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అకాడమీలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పోలీసులు సామాజిక కార్యకర్తలగా వ్యవహరించాలి అని. డబ్బు, అధికారం ఉన్న వాళ్ళతోటే పోలీసులు స్నేహంగా ఉంటున్నారు అని, బ్రిటీష్ కాలం నాటి పద్దతే ఇప్పటికీ కొనసాగుతోంది అని అయన వ్యాఖ్యానించారు. 


కాగా కొన్ని రోజుల క్రితమే వికె సింగ్ ని ప్రభుత్వం స్టేషనరీ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసింది. అయితే ఈ బదిలీ అతనికి ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగంలో చేయడానికి పని లేదని అది మూసివేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని అయన పేర్కొన్నారు. కాగా ఈ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వానికి రూ. 50 కోట్ల నష్టం వస్తుందని అయన చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: