వాట్సాప్ వాట్సాప్ వాట్సాప్  ఈ మధ్య ఎక్కడ చూసినా వాట్సాప్ కనిపిస్తుంది. ఏం సమాచారం పంపించాలన్న వాట్సాప్ కావాలి. వీడియో కాల్స్ వాయిస్ కాల్స్ మెసేజెస్ ఇలా దేని కోసమైనా ప్రస్తుతం ఉపయోగించేది వాట్సాపే . ప్రస్తుతం ఫోన్ లేని మనిషి లేడు అన్నది ఎంత నిజమో... వాట్సాప్ లేని  ఫోన్ లేదు అన్నది కూడా అంతే నిజం. ఫేస్ బుక్,  ట్విట్టర్ లాంటివి  ఎన్ని ఉన్నప్పటికీ వాట్సాప్ కి ఉన్న  క్రేజ్ మాత్రం సపరేట్. వాట్సాప్ మన చెంతనుండగా ఇక మిగితా యాప్స్  అన్ని  ఎందుకు దండగ అని అనుకుంటున్నారు ప్రస్తుతం వాట్సప్ వినియోగదారులు.

 

 

 

 

 

 వినియోగదారుల కోసం ఎప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తెస్తూ వినియోగదారులు ఆకర్షిస్తోంది వాట్సాప్. ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తుంది వాట్సాప్. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సరికొత్త ఫీచర్లు తెచ్చి వాట్సప్ వినియోగదారులకు ఆకర్షించగా ... ఇప్పుడు మరోసారి కొత్త ఫీచర్ తో మన ముందుకు వచ్చేసింది.అయితే ప్రస్తుత కొత్త ఫీచర్ ఏంటంటే..?  ఇప్పటికే మనం పంపిన మెసేజ్ లను ఎవరూ చూడకుండా "డిలీట్ ఫర్ ఎవ్రి వన్ " అనే ఆప్షన్ తెచ్చిన  వాట్సాప్... ఇప్పుడు ఈ ఆప్షన్ అప్ డేట్  చేయనుంది . 

 

 

 

 

 

 

 ఇక నుంచి మనం  పంపే మెసేజ్ లు 5 సెకన్ల నుంచి గంట వరకు మాత్రమే కనిపించి అ తర్వాత దానంతట అవే  మాయం అయ్యే విధంగా ఈ కొత్త ఫీచర్  అప్డేట్ చేస్తుంది వాట్సాప్. ఇక నుంచి డిలీట్ ఫర్ ఎవరీ వన్ కాకుండా మనం పంపే మెసేజ్ లు ఎదుటివారికి కాసేపు మాత్రమే కనిపించాలి అనుకుంటే ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ కొత్త ఫీచర్ కోసం వాట్సప్ సెట్టింగ్ లోకి వెళ్లి డిస్సప్పియర్  అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్  ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో అందుబాటులో ఉంది. ఏదేమైనా వాట్స్అప్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ మాత్రం ఆకర్షణీయంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: