ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కేవలం నాలుగు నెలల పరిపాలన కాలంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు.  ఈ నేపథ్యంలోనే జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ మహిళా నేతలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి వరాలు కురిపించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్లలో సగం పదవులు మహిళలతోనే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతకముందే కమిటీల్లో కూడా సగం మంది మహిళలే ఉండాలని  జగన్ ఆదేశించారు.


ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయనున్నారు. అక్టోబర్ చివరినాటికి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే జగన్ ప్రతి నిర్ణయంలోనూ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనబడుతోంది. ఇప్పటికే శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసి, జగన్ బీసీల్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు.


ఇక ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారి మద్ధతు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వడం అనేది సంచలన నిర్ణయమే. ఇది ఖచ్చితంగా అమలు చేస్తే మహిళల్లో జగన్ పట్ల సానుకూలత ఏర్పడుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 45-60 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు నాలుగేళల్లో ఏడాదికి రూ. 18, 750లు ఆర్ధిక సాయం కూడా చేస్తే జగన్ కు తిరుగుండదు.


అటు నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చి జగన్ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. మొత్తానికి జగన్ ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ...ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఈ ప్లాన్ స‌క్సెస్ ఫుల్‌గా అమ‌లు చేస్తే చంద్రబాబు మ‌రో ప‌దేళ్ల పాటు రాజ‌కీయంగా కోమాలోకి వెళ్లిన‌ట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: