నాయ‌కులు అధికారంలోకి రాగానే ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి ఎలా ప‌న్నులు ముక్కు పిండి వ‌సూలు చేయాలా అని ఉబ‌లాట ప‌డుతారు. ప్ర‌తి వ‌స్తువుల‌పై ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ప‌నుల భారం మోపి జ‌నాల‌ను ఉక్కిరి బిక్కిరి  చేస్తారు. అయితే ఇప్పుడు  ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వినూత్న ప‌థ‌కాల‌తో అంద‌రి మ‌దిని దోచుకుంటున్నారు. అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూ దేశంలోని మహామ‌హులైన పాల‌కులే విస్మ‌య ప‌డేలా చేస్తున్నారు. అంతే కాదు.. ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి ముక్కు పిండి ప‌న్నులు వ‌సూలు చేయ‌కుండా, ఇత‌ర మార్గాల ద్వారా అద‌న‌పు ఆదాయం స‌మ‌కూర్చుకుంటూ సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్రం ప్ర‌జ‌ల కోసం ప్ర‌వేశ‌పెడుతూ త‌న‌దైన ముద్ర వేస్తున్నారు.


అస‌లు ఎవ‌రి మ‌దిలో మెద‌ల‌ని ఆలోచ‌న‌ల‌కు ఓ రూపం ఇస్తూ, అసంఘ‌టిత రంగ కార్మికుల‌ను, సంఘ‌టిత రంగ కార్మికుల‌కు ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాలు ఇల‌లో ఎవ‌రు చేయ‌ని విధంగ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌దిలో మెదిలిన అద్భుత‌మైన ప‌థ‌కం వైఎస్సార్ వాహ‌న మిత్ర ప‌థ‌కం. ఈ ప‌థ‌కం ను వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అధికార ప‌గ్గాలు చేప‌ట్ట‌గానే ప్ర‌తి వాహ‌న‌దారుడికి ప్ర‌తిఏటా రూ.10వేల రూపాయ‌ల ఆర్థిక సాయం చేస్తాన‌ని పాద‌యాత్ర సంద‌ర్భంగా మాటిచ్చారు..


ఇది మాటే కాదు.. ఓ వ‌రం ఇచ్చాడు. దాన్ని తూచా త‌ప్ప‌కుండా ఇప్పుడు అమ‌లు చేస్తూ ప‌థ‌కాన్ని లాంఛ‌నంగా  శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ  ప‌థ‌కాన్ని ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆటో, క్యాబ్‌, కారు డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమానికి ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. పాదయాత్రలో గతేడాది మే 14న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ఈ పథకాన్ని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో  సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.


ఈ పథకాన్ని సంతృప్తకర స్థాయిలో అమలు చేసేందుకు బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 312 కోట్లు ఇతర కులాలకు, రూ. 68 కోట్లు ఎస్సీలకు, రూ. 20 కోట్లు ఎస్టీలకు కేటాయించనుంది. అయితే  ఈ ప‌థ‌కం అమ‌లు చేసేందుకు ముందుగా వాహ‌న‌దారుల నుంచి ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించింది. ఇందులో 1,75,352 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా ఇందులో 2,250 ద‌ర‌ఖాస్తులు తిర‌స్క‌రించి, 1,73,102 ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించారు.


ఇందులో 1,56,804 ఆటోలు, 5093 మ్యాక్సీ క్యాబ్‌లు, 11,205 ట్యాక్సీ క్యాబ్‌లు ఉన్నాయి.. వీరంతా మ‌ద్య‌త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల‌కు చెందిన వారు కావ‌డం విశేషం. ఈ ప‌థ‌కంతో వీరి కుటుంబాల్లో వెలుగు నింప‌నున్నారు. అస‌లే పేద మ‌ద్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన వాహ‌న‌దారులు ఓలా, ఊబర్ వంటి క్యాబ్‌ల‌తో తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. ఈ మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీల నుంచి పేద వ‌ర్గాల వాహ‌న‌దారుల‌ను ఆదుకునేందుకు సీఎం మ‌దిలో నుంచి పుట్టిన ప‌థ‌క‌మే.. ఈ వైఎస్సార్ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం. 



మరింత సమాచారం తెలుసుకోండి: