ఏపీలో ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల‌కు కంటిమీద కునుకులేకుండా బ‌తుకుతున్నారంటే అతిశ‌యోక్తి కాదేమో.. ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాలు, ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాలు ప్ర‌తిప‌క్షాల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌తో ఇక ఏపీ ప్ర‌జ‌లు త‌మ వంక చూస్తారో లేదో అనే సందిగ్ధావ‌స్థ‌లో ప‌డిపోతున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ రేపు వైఎస్సార్ వాహ‌న మిత్ర ప‌థ‌కం లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నారు. ఇది అమ‌లు అయితే ఇక భవిష్య‌త్‌లో ఏ వాహ‌న‌దారుడైనా జీవితాంతం సీఎం జ‌గ‌న్ కు జై కొట్టాల్సిందే. ఈ ప‌థ‌కం వాహ‌న‌దారుల‌కు ఓ వ‌రంగానే భావిస్తున్నారు.


అయితే జ‌గ‌న్ త్వ‌ర‌లో మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఈ ప‌థ‌కం క‌నుక సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెడితే ఇక జ‌గ‌న్ స‌ర్కారుకు తిరుగే ఉండ‌దు. స‌రిక‌దా.. సీఎం జ‌గ‌న్ మాట‌ను ఆ ప‌థ‌కం ల‌బ్ధిదారులు, వారి కుటుంబ స‌భ్యులు వైసీపీ వెంట న‌డువాల్సిందే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఇంత‌కు సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ‌బెట్ట‌బోయే ప‌థ‌కం ఏమై ఉంటుంది.. ఆ ప‌థ‌కం ఎప్పుడు ప్ర‌వేశ‌బెట్ట‌బోతున్నారు.. అని అనుకుంటున్నారా.. ఏపీ సీఎం ప్ర‌వేశ‌బెట్ట‌బోయే ప‌థ‌కం రైతు భ‌రోసా ప‌థ‌కం.


ఈ ప‌థ‌కంను అక్టోబ‌ర్ 15న లాంఛ‌నంగా సీఎం జ‌గ‌న్ ప్రారంభించ‌బోతున్నారు. ఈ ప‌థ‌కంతో రైతులుకు గిట్టుబాటు ధ‌ర‌ల‌తో పాటు, వారి సంక్షేమం కోసం ప్ర‌భుత్వం పాటుప‌డుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేసిన దాఖాలాలు లేవు. అయితే సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌గానే రైతు భ‌రోసా ప‌థ‌కంను ప్ర‌కటించారు. ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర అంద‌డంతో పాటుగా, రైతులు న‌ష్ట‌పోకుండా చూడ‌ట‌మే ఈ ప‌థ‌కం ధ్యేయంగా ఉంటుంది. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధితో రైతుల‌కు న్యాయం చేయ‌డం జ‌రుగుతుంది.


ఈ ప‌థ‌కం ప‌టిష్టంగా అమ‌లు  చేసేందుకు స‌హ‌కార శాఖ‌ను ఆధునీక‌రించి, బ‌లోపేతం చేసేందుకు ఇప్ప‌టికే జ‌గ‌న్ స‌ర్కారు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. న‌ష్టాల్లో ఉన్న డీసీసీబీల‌ను బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. రైతు ఏ పంట పండించినా గిట్టుబాటు ధ‌ర అందించాల‌న్న‌దే సీఎం జ‌గ‌న్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ ప‌థ‌కం అమ‌లైతే జ‌గ‌న్ స‌ర్కార్‌కు తిరుగే ఉండ‌ద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభిప్రాయ‌పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: