అధికారం కోల్పోయాక టీడీపీ అధినేత చంద్రబాబులో అసహనం బాగా పెరిగిపోయినట్లుంది. ఒకవైపు ఘోరంగా ఓడిపోవడం...మరోవైపు నేతలు జంప్ అయిపోవడంతో బాగా ఫ్రస్టేట్ అవుతున్నట్లున్నారు. ఆ ఫ్రస్టేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాకుండా మాట్లాడేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. అయితే ఇక్కడ నిర్మాణాత్మక విమర్శలు చేస్తే బాగానే ఉంటుంది గానీ...ఏదో గుడ్డెద్దో చేలో పడ్డట్టు వైసీపీ ప్రభుత్వంపై గుడ్డిగా విమర్శలు చేసేస్తున్నారు.


జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...వాటి మీద విమర్శలు,ఆరోపణలు చేస్తున్నారు. అయితే తర్వాత వాటి మీద నిలబడుతున్నారా? అంటే అది లేదు. ఇటీవల జగన్ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు కల్పించారు. అందులో గ్రామ వాలంటీర్లు, సచివాలయాల పేరిట నాలుగు లక్షల వరకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇక వీటిపై చంద్రబాబు తనకిష్టం వచ్చినట్లు విమర్శలు చేశారు. గ్రామ వాలంటీర్లని అయితే చులకన చేస్తూ మాట్లాడేశారు.


ముఖ్యంగా గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీక్ అయిందని., కావల్సిన వారికి ఉద్యోగాలు వచ్చేలా చేశారని ఆరోపణలు గుప్పించారు. అసలు ఆయన హయాంలో అన్నీ ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలేదు. పైగా గత బాబు వస్తే జాబు అని చెప్పి నిరుద్యుగులని నిలువన ముంచేశారు. కానీ ఇప్పుడు జగన్ వాళ్ళకి అండగా నిలబడి ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు వచ్చిన వారందరూ చాలా సంతోషంగా కూడా ఉన్నారు. అటు రాని వారు మరో నోటిఫికేషన్ కోసం ఆతృతగా చూస్తున్నారు. ఈ మధ్యలో బాబు గుడ్డిగా ఆరోపణలు చేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందే పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆయన మాటలని ఎవరు పట్టించుకోకపోవడంతో పేపర్ లీక్ మాటలు మళ్ళీ మాట్లాడటం లేదు.


ఇక తాజాగా మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం షాపులని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఎక్కడ కూడా మద్యం షాపులు పని చేయవని తెలుసు. ఏపీలో కూడా మద్యం షాపులన్నీ బంద్ అయ్యాయి. అయిన సరే బాబు మాత్రం మహాత్ముని జయంతి రోజు కూడా వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మిందంటూ నోటికొచ్చిన విమర్శలు చేశారు. ఇలా బాబు రోజు గుడ్డి విమర్శలు చేస్తూ ప్రజల్లో ఇంకా చులకన అవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: