ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాలు  ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల నేత‌ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా ప‌రిపాల‌న చేస్తున్నాడు. అనేక సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూనే మ‌రోవైపు విధాన నిర్ణ‌యాలు త్వ‌ర‌గా తీసుకుంటూ ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను విస్మ‌యానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. అటు అధికారుల‌ను, ఇటు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూ, అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ నిత్యం బిజిగా ఉంటున్నారు సీఎం జ‌గ‌న్‌.


అస‌లు సీఎం జ‌గ‌న్ ఇలా ప‌రిపాల‌న‌ను ఎందుకు ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. ప‌రిపాల‌న‌లో ఎందుకు ఇలా దూకుడుగా ముందుకు పోతున్నారు. సమీక్ష‌ల పేరుతో అధికారుల‌ను ఎలా స‌మ‌న్వ‌యం చేసుకోగ‌లుగుతున్నారు.. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ఈ విధంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.  అస‌లు జ‌గ‌న్‌కు అనుభ‌వం లేదు.. ఆయ‌న కు ప‌రిపాల‌న  చేయ‌రాదు.. అవినీతి ప‌రుడు రాజ్య‌మేల‌డం చేత‌కాదు.. ఒక‌వేళ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటాడు.. ఓ ఫ్యాక్ష‌నిస్టు కు అధికారం చేతికిస్తే రాష్ట్రంలో ఆశాంతి చెల‌రేగుతుంది.. మ‌ళ్ళీ ఫ్యాక్ష‌నిస్టులు రాజ్య‌మేలుతారు అంటూ ఈ నేత‌లు విమ‌ర్శ‌లు చేశారు.


అయితే 2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కూడా జ‌గ‌న్‌కు అనుభ‌వం లేదు.. రౌడీ రాజకీయం చేస్తారంటూ విమ‌ర్శ‌లు చేసి చంద్రాలు అధికారంలోకి వ‌చ్చారు. అదే 2019 ఎన్నిక‌ల్లోనూ పున‌రావృతం చేశారు. కానీ జ‌గ‌న్ కు ఏపీ ప్ర‌జ‌ల బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఒక్క‌సారి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. రాజ‌న్న రాజ్యం తెస్తానంటున్నారు.. ఆయ‌న స‌త్తా ఏందో చూద్దామ‌ని ఏపీ ప్ర‌జ‌లంతా గంప‌గుత్త‌గా వైసీపీకి ఓట్లేసి, జ‌గ‌న్‌ను బంఫ‌ర్ మెజారిటీతో గెలిపించారు. ఇక ఏపీ సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన వెంట‌నే జగ‌న్ రంగంలోకి దూకారు.. ఇక ఏమాత్రం వెనుక‌డు వేయ‌కుండా త‌న పనిని స‌మీక్ష‌ల పేరుతో ప్రారంభించారు.


ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూ, వాటిని అమ‌లు చేస్తూ, గ‌త పాల‌న తీరుతెన్నుల‌ను స‌మీక్షిస్తూ, అవినీతిని వెలికితీస్తూ, అవినీతి నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటూ ఎవ‌రికి అంతుచిక్క‌ని నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నారు. జ‌గ‌న్ ప‌రిపాల‌న అనుభ‌వం లేద‌ని అన్న ప్ర‌తిపక్ష నేత‌లు ఇప్పుడు జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు షాక్ తింటున్నారు. ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో ఎవ్వరికి అంతు చిక్క‌డం లేదు. ప‌రిపాల‌న‌లో దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తూ అధికార ప‌క్ష నేత‌ల‌కు కూడా అంతు చిక్క‌ని నిర్ణ‌యాలు తీసుకుంటూ ఎక్క‌డ పాల‌నాప‌ర‌మైన లీకులు లేకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఓవ‌రాల్‌గా 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ కంటే 4 నెల‌ల పాల‌న ఎంత గొప్ప‌గా ఉందో అన్న ప్ర‌శంస‌లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి.


ప‌రిపాల‌న అనుభ‌వం లేదు అనే అప‌వాదును ద‌రిచేర‌నీయ‌కుండా.. ఓ అనుభ‌వ‌జ్ఞుడు చేస్తున్న ప‌రిపాల‌న ఎలా ఉంటుందో.. ఎలా నిర్ణ‌యాలు తీసుకుంటారో వాటిని మించి ప‌రిపాల‌న చేస్తూ అంద‌రిని ఔరా అనేలా చేస్తున్నాడు. అందుకు నిద‌ర్శ‌నం పోల‌వరం రివ‌ర్స్ టెండ‌రింగ్‌. విద్యుత్ లో పీపీఏల స‌మీక్ష‌. ఇలా జ‌గ‌న్ దూకుడు నిర్ణ‌యాల‌తో ప్ర‌తిప‌క్ష నేత‌లైన చంద్రాలు, ప‌వ‌నాలుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు జ‌గ‌న్‌. సీఎం జ‌గ‌న్ ఇలాగే దుందుడుకుగా నిర్ణ‌యాలు తీసుకుని, ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి విజ‌య‌వంతం చేస్తే ప్ర‌తిప‌క్షాలు కూడా ఉనికిలో లేకుండా పోయే ప‌రిస్థితి రావొచ్చ‌నే భ‌యం ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు ప‌ట్టుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: