సామాజిక కార్యకర్తల్లా  ఉండాల్సిన పోలీసులు.. డబ్బు, అధికారం ఉన్నవాళ్లతోనే స్నేహంగా ఉంటున్నారన్నారని పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ ఆరోపించారు. ట్రెయినింగ్ అకాడమీలు కూడా  డంపింగ్ యార్డులుగా మారాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం అకాడమీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులు ప్రభుత్వానికి జవాబుదారీ కాదన్నారు. పోలీస్ కేవలం  చట్టానికి, న్యాయానికి మాత్రమేనని స్పష్టం చేశారు. అకాడమీలో ఇస్తున్న శిక్షణ క్షేత్ర స్థాయిలో పనికి రావడం లేదని విమర్శించారు. సీఐ నుంచి ఎస్పీ వరకు క్షేత్రస్థాయిలో పని చేసే తీరును పర్యవేక్షించి రాష్ట్ర డీజీపీకి నివేదిక అందజేస్తామన్నారు.



దాని ప్రకారమే పదోన్నతలు ఉండాలన్నారు. కౌన్సెలింగ్ కేంద్రాలను అకాడమీలో ప్రారంభిస్తున్నామని.. ఈ నెల 24న ప్రారంభం అయ్యే బ్యాచ్‌కు కౌన్సిలింగ్ నూతన పద్ధతిలో అమలు చేయనున్నట్టు తెలిపారు. పోలీస్ అంటే కేవలం బిల్డర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదని.. వికలాంగుడైనా పోలీస్ కావొచ్చన్నారు. పోలీసు ట్రైనింగ్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయన్నారు. అదంతా వృధా అవుతోందన్నారు. పోలీస్ అకాడమీలు స్కూళ్లు, కాలేజీలు కావని అన్నారు.  ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలో శిక్షణలో నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలీసులు చెప్పింది ప్రజలు వింటారని చెప్పారు. కానీ ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదని వీకే సింగ్ వ్యాఖ్యానించారు.





ట్రైనింగ్ సెంటర్‌లలో శిక్షణ తీసుకుని బయటకు వెళ్తున్న అధికారులు.. డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకురాలేకపోతున్నారని అన్నారు. 
ప్రజల కోసం పోలీసులు బలవుతున్నప్పటికీ ఎక్కడా ప్రజల నుంచి గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం శిక్షణలోనే లోపముందన్నారు. బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితీ ఇంకా పోలీస్ శాఖలో కొనసాగుతుందన్నారు. కేవలం డబ్బు ఉన్నవారికి మాత్రమే పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు.  జైల్లో ఉన్నవారు 90 శాతం బీదవారేనన్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చామో కూడా తెలియదని వీకే సింగ్ వాపోయారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: