జగన్ క్యాబినెట్లో పాతిక మంది మంత్రులు ఉంటే వారిలో చురుకుగా ఉన్న వారిని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. దానికి నివేదికలు, అంచనాలు కూడా అవసరం లేదు. తమ శాఖల్లో పనితీరుని మెరుగుపరచుకుంటూ ప్రతిపక్షాన్ని కట్టడి చేసే మంత్రుల్లో సీనియర్లే అగ్రభాగాన ఉన్నారు. ఇక కొత్తవారు, జూనియర్ మంత్రుల్లో మాత్రం కొందరు మాత్రమే ఆ దిశగా మెరుగుపరచుకుంటున్నారు. మిగిలిన వారు మాకెందుకీ ధోరణి అన్నట్లుగా  ఉన్నారు. 


చంద్రబాబుతో పాటు, తమ్ముళ్లు ప్రతీ రోజూ వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తూనే  ఉ న్నారు. వారిని అటాక్ చేయడంతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ముందున్నారు. ఆయన తరువాత చెప్పాలంటే జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కనిపిస్తారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అపుడపుడు స్పందిస్తున్నారు. బాలినేని శ్రీనివాస‌రెడ్డి శాఖాపరంగానే స్పందిస్తున్నారు. 


ఇక జగన్ కి అండగా విపక్షంపై తిరగబడే స్థాయిలో మిగిలిన మంత్రులు లేరు. అపుడపుడైనానా విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు, విజయనగరం మంత్రిణి పుష్ప శ్రీవాణి బాబు మీద అటాక్ చేస్తున్నారు. అలాగే కన్నబాబు కూడా గట్టిగానే అపుడపుడు కౌంటర్లు ఇస్తున్నారు. మిగిలిన మంత్రుల్లో చూస్తే  శ్రీకాకుళం జిల్లా మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ మౌనమే నా భాష అంటున్నారు. గోదావరి జిల్లాలో పినిసె విశ్వరూప్ ఆయనకు తోడుగా ఉంటున్నారు.


అదే విధంగా ఆళ్ల నాని, తానేటి వనిత, హోం మంత్రి మేకతోటి సుచరితలతో పాటు, రాయలసీమకు చెందిన మంత్రులెవరూ అసలు నోరు విప్పడంలేదు. మరి ఈ రకమైన పరిస్థితుల్లో ప్రతీ రోజూ అనుకూల మీడియా అండతో రెచ్చిపోతున్న టీడీపీని కట్టడి చేయడానికి మంత్రులు దూకుడు పెంచాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. నాలుగు నెలలు గడిచినా తీరు మారకపోతే జగన్ షాకింగ్ డెసిషన్లు తీసుకోవాల్సిందేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: