శరీరంలో ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మనిషి జీవనం సక్రమంగా ఉంటుంది . సజావుగా సాగుతుంది.  అలా కాకుండా ఏదైనా ఎక్కువైనా, ఆ అవయవం లోపించినా మానవ జీవనం కుంటుపడుతుంది.  దానివలన అతని ఆరోగ్యం దెబ్బతింటుంది.  ప్రాణాలకే ముప్పు రావొచ్చు.  కొందమందిలో కొన్ని అవయవాలు కొంత తేడాతో  పెద్దగా ఉంటాయి.  అదేమంత పెద్ద  విషయం కాదు.  


అలా కాకుండా, కన్ను ఉండాల్సిన స్థానంలో ముక్కు, ముక్కు ఉండాల్సిన స్థానంలో నోరు ఉంటె ఎలా ఉంటుంది.. చూసి దడుచుకుంటారు.  హాలీవుడ్ సినిమాల్లో కనిపించే వింతజీవి అని భయపడతారు.  శరీరం బయట అయితే భయపడతారు.  అదే  శరీరం లోపల ఉండాల్సిన అవయవాలు వేరే వేరే ప్లేస్ లలో ఉంటె... ఇక చెప్పాల్సిన అవసరం ఏముంది.  


ఆ మనిషి నడవడిక దారుణంగా ఉంటుంది.  అసలు అలా ఉంటారా అంటే ఉంటారట.  అలాంటి వ్యక్తిని ఇటీవల డాక్టర్లు గుర్తించారు.  ఆ వ్యక్తి ఎక్కడో కాదు ఇండియాలోనే ఉన్నాడు.  ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ పాద్రౌనా ప్రాంతానికి చెందిన జమాలుద్దీన్ అనే వ్యక్తి  చూసేందుకు అందరిలాగా సాధారణంగా కనిపిస్తాడు.  మామూలుగానే జీవిస్తున్నాడు.  ఇటీవలే ఒంట్లో బాగాలేని చెప్పి గోరఖ్ పూర్లోని ఓ హాస్పిటల్ కు వెళ్లారు.  


అక్కడ ఆయనకు పరీక్షలు చేసి డాక్టర్లు షాక్ అయ్యారు.  శరీరంలోపల ఉండాల్సిన అవయవాలు ఒక దాని ప్లేస్ లో మరొకటి ఉన్నాయి.  ఎవరికైనా సరే గుండె ఎడమభాగంలో ఉంటుంది.  కానీ జమాలుద్దీన్ కు కుడిభాగంలో ఉంది.  అలానే పిత్తాశయం ఎడమభాగంలో ఉండటం వలన వైద్యులు షాక్ అయ్యారు.  పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించారు.  ప్రస్తుతం అయన కోలుకుంటున్నట్టు వైద్యులు చెప్తున్నారు.  ఇలాంటి కేసు 1634 వ సంవత్సరంలో ఒకేసారి వైద్యులు గుర్తించినట్టు మెడికల్ చరిత్ర ప్రకారం తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: