సాధారణంగా ఒక మేక ఖరీదు ఎంత ఉంటుంది... మహా అయితే 5 వేలు ఉంటుంది.  లేదు దాన్ని మంచి పోషకాహారం పెట్టి పెంచారు.. చాలా బాగా చూసుకున్నారు.. అది అందంగా కూడా ఉంటుంది అనుకుంటే.. 20 వెలవరకు ఉంటోచ్చు.  అంతకు మించి ఉంటుంది అనుకోవడం లేదు.  కానీ, ఒడిశాలోని ఓ మేక ఖరీదు ఏకంగా రూ. 3 కోట్ల వరకు ఉంది.  అదేం మేక అంత ఖరీదు ఎలా ఉన్నది.. ఎవరు దాన్ని కొన్నారు ఎవరు అమ్మారు అనే డౌట్స్ వస్తున్నాయి కదా.. అక్కడికే వస్తున్నా.. 


ఓడిశాలోని మహానది కోల్ మైన్స్ ప్రాజెక్ట్ సమీపంలోని ఓ గ్రామం. ఆ గ్రామంలో ఓ మేక ఉన్నది.  ఆ మేకను ఓ గూడ్స్ రైల్ వేగన్ ఢీకొన్నది. దీంతో ఆ మేక చనిపోయింది.  దీంతో ఆ గ్రామ ప్రజలు కోల్ మైన్ దగ్గరికి గొడవ చేశారు.  చనిపోయిన మేకకు నష్టపరిహారంగా రూ.60వేలు చెల్లించాలని పట్టుబట్టారు.  నష్టపరిహారం 60వేలా అని షాక్ అయ్యారు.  ఒప్పుకోలేదు.  దాదాపు మూడు గంటలపాటు రగడ జరిగింది.  ఈ మూడు గంటలు బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.  


ఈ మూడు గంటలు బొగ్గు ఉత్పత్తి ఆగిపోవడం వలన మహానది కోల్ మైన్ సంస్థకు 1.48 కోట్లు నష్టం వచ్చింది.  రైల్ రవాణా మూడు గంటలపాటు నిలిచిపోవడం వలన రైల్వే సంస్థకు మహానది బొగ్గు ఉత్పత్తి సంస్థ 1.28 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.  దీంతో పాటు చనిపోయిన మేకకు కూడా నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది.   పాపం మొత్తంగా మహానది బొగ్గు ఉత్పత్తి సంస్థకు ఈ విధంగా మూడు కోట్ల వరకు లాస్ వచ్చింది.  


ఒక చిన్న మేక మూడు కోట్ల ధర పలికినట్టు అయ్యింది.  అయితే, దీనికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఉత్పత్తికి నష్టం తీసుకొచ్చిన ప్రజలపై యాజమాన్యం కేసు దాఖలు చేసింది.  మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.  ఎందుకంటే మూడు గంటల పాటు రైల్ రవాణాను నిలిపివేయడం అంటే మాములు విషయం కాదు.  కేంద్రం ఈ విషయంలో సీరియస్ అవుతుంది.  మరి చూద్దాం దీనిపై తరువాత ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: