హుజూర్ నగర్లో ప్రచారం జోరుమీదుంది.  అన్ని పార్టీలు తమ శక్తిని వినియోగించి ప్రచారం చేస్తున్నారు.  ముందు కాంగ్రెస్, తెరాస పార్టీల మధ్య పోటాపోటీ ఉంటుంది అనుకున్నారు. అంతలోనే బీజేపీ వచ్చి చేరింది.  హుజూర్ నగర్లో బీజేపీకి మంచి ఓటు బ్యాంకింగ్ ఉంది.  ఇటీవల కాలంలో అక్కడ చాలామంది యువత బీజేపీలో జాయిన్ అయ్యారు.  స్థానికంగా చాలాకాలంగా బీజేపీ నేతలు అక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు. 


ఇక తెరాస పార్టీకి చెందిన ముఖ్య కేడర్ మొత్తం హుజూర్ నగర్లోని తిష్ట వేసింది.  ఎలాగైనా హుజూర్ నగర్ నియోజక వర్గంలో గెలవాలని పట్టుదలతో ఉంది.  రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉపఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుంది.  పైగా ఇప్పుడు రాష్ట్రంలో పార్టీకి కొంత వ్యతిరేకత ఏర్పడింది.  హుజూర్ నగర్లో ఓడిపోతే అది నిజమేనేమో అనిపిస్తుంది.  అందుకే పార్టీ ఎలాగైనా గెలవాలని బలంగా పనిచేస్తున్నది.  


మరోవైపు కాంగ్రెస్ పార్టీకూడా గెలుపుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ఎందుకంటే.. గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది.  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాబట్టి తిరిగి అక్కడ గెలవాలని చూస్తున్నది.  కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీలో ఉన్నది.  మిగతా వాళ్ళను నిలబెడితే.. తెరాస లోకి వెళ్తారని అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ భార్య కాబట్టి పార్టీ మారే అవకాశం లేదు.  కాబాట్టి గెలుపుపై నమ్మకంతో ఉన్నది కాంగ్రెస్.  


ఇక ఇదిలా ఉంటె, కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని నియమించింది.  చావా కిరణ్మయి కోసం చంద్రబాబు నాయుడు ప్రచారం చేయబోతున్నాడు.  బాబు ప్రచారం చేస్తున్నారనే విషయం తెలుసుకున్న తెరాస పార్టీ హ్యాపీగా ఫీలవుతున్నది.  ఎందుకంటే.. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్న టిడిపి.. బాబు ప్రచారం చేయడం వలన తెరాస విజయం సాధించింది.  బాబు వ్యతిరేకత ఉన్న ఓట్లు తెరాస పార్టీకి పడ్డాయి.  కాంగ్రెస్ గెలవాల్సిన స్థానాల్లో కూడా తెరాస విజయం సాధించింది.  ఇది బాబు ప్రచారం వలన మాత్రమే ఇలా జరిగిందని అప్పట్లో  వార్తలు వచ్చాయి.  మరి ఇప్పుడు సొంతంగా పోటీ చేస్తున్నారు కాబట్టి బాబు విజయం సాధిస్తాడా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: