ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఒకరోజు తగ్గితే మరో రోజు పెరుగుతూ ఇలా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆగస్ట్ అంతా బంగారం ధర భారీగా పెరిగి సెప్టెంబర్ అంత తగ్గుతూ వచ్చింది. వారం రోజులు తగ్గిన రేటు ఒకటే రోజు పెరిగిపోతుంది. దీంతో పసిడి ప్రేమికులకు చుక్కలు కనిపించేలా చేశాయి.            

                          

అయితే బంగారం ధర గురించి పక్కన పెడితే.. వెండి ధర భారీగా తగ్గింది. దాదాపు రెండు నెలల క్రితం ఉన్న రేటుకు వచ్చిసింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.910 పెరుగుదలతో రూ.39,580కు చేరగా, 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.910 పెరుగుదలతో రూ.36,360కు చేరింది.                 

                   

వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,350 తగ్గుదలతో రూ.45,750కు చేరింది. తయారీదారుల నుంచి సరైన డిమాండ్‌‌ లేకపోవడమే ఇందుకు కారణం. ఏది ఏమైనా సామాన్య ప్రజలు బంగారం కొనలంటే గుండెని పట్టుకునే స్టేజికి తీసుకొచ్చింది. మరోవైపు వెండి ధర భారీగా తగ్గి ప్రజలకు కాస్త ఊరటనిచ్చింది. ఈ దెబ్బతో పసిడి ప్రియులకు మాత్రం షాక్ తగిలింది.                              

                                   

మరింత సమాచారం తెలుసుకోండి: