ఆర్టికల్ 370 రద్దుకు ముందు రెండు ఇండియా పాక్ దేశాల మధ్య గొడవలు ఉన్నాయి.  బోర్డర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నది పాక్. ఇండియాలోకి యథేచ్ఛగా తీవ్రవాదులను చొరబడే విధంగా చేస్తూ అలజడిని సృష్టిస్తూనే ఉన్నది.  జమ్మూ కాశ్మీర్ లో ఉండే ఆర్మీపై అక్కడి ప్రజలు తిరగబడుతూనే ఉన్నారు.  ప్రజలపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆర్మీకి అధికారం లేదు.  పోలీసులు సైతం వారిపై చర్యలు తీసుకోలేదు.  


రాళ్ళూ రువ్వే వ్యక్తులపై ఎలాంటి కేసులు ప్రభుత్వం పెట్టదు.  ప్రభుత్వం రాళ్లు రువ్వే వ్యక్తులకు అండగా నిలిచేది.  వీటన్నింటికి  కారణం ఆర్టికల్ 370.  దీన్ని అడ్డం పెట్టుకొని అక్కడి రాజకీయ నాయకులు వీటికి ప్రోత్సహించేవారు.  ఫలితంగా కేంద్రం నుంచి అదే నిధులను అక్కడి రాజకీయ నాయకులు యథేచ్ఛగా వాడుకుంటున్నారు.  ప్రజలకు అభివృద్ధి ఫలాలను దూరం చేశారు.  రాష్ట్రంలో ఉగ్రాకార్యకలాపాలు అధికంగా ఉన్నాయి.  


దీంతో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసింది.  అప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  పాక్ ఇండియాపై యుద్ధం చేస్తానని అంటున్నారు. అవసరమైతే అణుయుద్ధం చేస్తామని అంటోంది.  అణుయుద్ధం వస్తే రెండు దేశాల్లో జరిగే అపార నష్టం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  అణుయుద్ధం వస్తే..  గంటల వ్యవధిలోనే పరిస్థితులు దారుణంగా మారిపోతాయి అనడంలో సందేహం అవసరం లేదు.  


అణుయుద్ధం వస్తే రెండు దేశాల్లో ఎంతమంది మరణించే అవకాశం ఉందని విషయం గురించి అమెరికన్ విశ్వవిద్యాలయం ఓ నివేదికను తయారు చేసింది. అణుయుద్ధం వస్తే రెండు దేశాల్లో 12.6 కోట్ల మంది ప్రజలు మరణించే అవకాశం ఉందంట.  అంతేకాదు, పొగతో కూడిన అణుధార్మిక బూడిన 16నుంచి 3.6 లక్షల టన్నుల వరకు వెలువడే అవకాశం ఉంది.  భూమిపై ఐదు సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్టుగా విశ్వవిద్యాలయం తెలియజేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: