మాజీ ఎంపీ, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు హ‌ర్ష‌కుమార్‌. ఎస్సీ వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో కాంగ్రెస్ త‌ర‌ఫున అమ‌లాపురం నుంచి విజ‌యం సాధించి పార్ల‌మెంటులో వాయిస్ వినిపించారు. అయితే, ఆయ‌న హయాంలో చెప్పుకోద‌గ్గ విజ‌యాలేవీ కోన‌సీమ‌కు చేకూర‌లేదు., దీంతో పెద్ద‌గా ఆయ‌న ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ల‌భించ‌లేద‌నేది వాస్త‌వం. అయితే, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్‌కు దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లాల‌ని చూసినా.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు స‌హ‌క‌రించ‌లేదు. దీంతో ఇటీవ‌ల ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న టీడీపీలోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు.


ఈ క్ర‌మంలోనే అమ‌లాపురం ఎంపీ టికెట్‌ను ఆశించారు. అయితే అప్ప‌టికే సెంటిమెంటు రాజ‌కీయాల‌ను న‌మ్ముకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ టికెట్‌ను మాజీ లోక్‌స‌భ స్పీక‌ర్ బాల‌యోగి కుమారుడికి క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఇక‌, దీంతో హ‌ర్ష‌కుమార్ సైలెంట్ అయ్యారు. అయితే, ఆయ‌న రాజ‌కీయంగా త‌న‌కు తాను పెద్ద‌గా ఊహించుకున్నారేమో అనిపించేలా ప్ర‌భుత్వంపైనా.. జ‌గ‌న్‌పైనా కామెంట్లు చేశారు. వీటికి చంద్ర బాబు అనుకూల మీడియా పెద్ద ఎత్తున క‌వ‌రేజీ ఇచ్చింది. దీంతో ఆయ‌న త‌ర్వాత కాలంలోనూ రెచ్చిపో యారు. జ‌గ‌న్ ఈ రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని అంటూ, ఆయ‌న వ్యాఖ్య‌లు సంధించారు.


ఇక‌, ఇటీవ‌ల గోదావ‌రి ప్ర‌మాదం సంభించిన స‌మ‌యంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ను టార్గెట్ చేసుకు న్న హ‌ర్ష‌కుమార్‌... ఆయ‌న ఒత్తిడి మేర‌కే పోలీసులు స‌ద‌రు బోటును అనుమ‌తించార‌ని, కాబ‌ట్టి ఆ మంత్రి ని  కేబినెట్‌నుంచి తొల‌గించాల‌ని, లేదా పోలీసుల‌ను విచారించాల‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను పోలీసు వ‌ర్గాలు అప్ప‌ట్లోనే సీరియ‌స్‌గా తీసుకున్నాయి. అదేస‌మ‌యంలో స్థానిక జిల్లా కోర్టులో క‌ట్ట‌డాల‌ను కూల్చుతున్న ద‌గ్గ‌ర‌కు వెళ్లిన హ‌ర్ష‌కుమార్ జ‌డ్జిని దూషించార‌ని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతొ ఆయ‌న‌ను అరెస్టు చేయాల‌ని ఆదేశాలు ఇచ్చారు.


దీనిని పాటించ‌ని ఓ సీఐని స‌స్పెండ్ కూడా చేశారు. ఇక‌, ఇప్పుడు ఎలాగైనా హ‌ర్ష‌కుమార్‌ను అరెస్టు చేసి తీరేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, దీనిని గ‌మ‌నించిన‌.. హ‌ర్ష‌కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో హ‌ర్ష‌కుమార్‌కు ఇప్పుడు దిక్కెవ‌రు?  నోరు అదుపులో లేక కొని తెచ్చుకున్న క‌ష్టాలు అని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. పిల్ల రాజ‌కీయాలు మానుకుని పెద్ద‌రికం నిల‌బెట్టుకుంటే మంచిద‌ని సూచిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: