కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వంలో అతి చిన్న వయసు గల మంత్రి పుష్పశ్రీ వాణి. ఆమె వయసు 31 సంవత్సరాలు. మంచి విద్యావంతురులు, డేర్ అండ్ డ్యాషింగ్ లేడీగా పేరొందిన పుష్ప..ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలకోసం నిరంతరం పోరాడుతూ వస్తున్న పుష్ప...2014లో వైసీపీ తరుపున కురుపాం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే మొన్న ఎన్నికల్లో కూడా ఆమె బంపర్ మెజారిటీ తో గెలుపొందారు.


అయితే రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడమే పుష్పశ్రీ బంపర్ ఆఫర్ కొట్టేసింది. గిరిజన సమస్యలపై పోరాడుతుండటంతో ఆమెకు జగన్ గిరిజన మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మంత్రి పదవికి తోడు ఆమెని డిప్యూటీ సీఎం కూడా చేసేశారు. ఈ రెండు పదవులే కాకుండా జగన్ ఆమెని గిరిజన మండలి ఛైర్మన్ గా చేశారు. అతి చిన్న వయసులో పెద్ద బరువు ఉన్న పదవులని చేపట్టిన పుష్పశ్రీ వాణి సక్సెస్ అయ్యారా అనే విషయం ఒక్కసారి పరిశీలిస్తే. ఈ నాలుగు నెలల కాలంలో ఆమె శాఖకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  


మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే గిరిజన కమ్యూనిటీ వర్కర్ల జీతాల పెంపు చేశారు. అలాగే గిరిజన ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు 19.97 కోట్ల రూపాయలను వౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మంజూరు చేశారు. వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద గిరిజన వధువుకు ఇచ్చే సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.53 కోట్లు కేటాయించింది.


గిరిజన కుటుంబాలకు గతంలో 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వగా, ప్రస్తుతం 200 యూనిట్లకు పెంచింది. అటు ఎస్సీ,ఎస్టీ కమిషన్ల పేరిట రుణాల మంజూరు చేశారు. గిరిజనుల్లో ఎవరైనా ప్రమాద వశాత్తు మరణిస్తే వైఎస్సార్‌ ప్రమాద బీమా కింద ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఇవన్నీ జగన్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలు. ప్రస్తుతానికైతే ఆమె శాఖపై పెద్దగా పట్టు సాధించనట్లే కనిపిస్తోంది.


ఒకేసారి అన్ని పెద్ద పదవులు లభించిన ఆమె సద్వినియోగం చేసుకోలేదని చెప్పాలి. అటు అధికార నేతగా ప్రతిపక్షాల చేసే విమర్శలని తిప్పికొట్టడంలో కూడా పుష్పశ్రీ వాణి విఫలమైనట్లే ఉంది. మొత్తం మీద మంత్రివర్గంలో అతి చిన్న వయసు గల...పుష్పకు అనుభవం బాగా తక్కువైందని అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: