అది ఏలూరు ప‌ట్ట‌ణం.. 2018 మే 14.. జ‌గ‌న్ మ‌హాపాద‌యాత్ర దిగ్విజ‌యంగా సాగుతుంది. అక్క‌డ సీఎంను ఆటో డ్రైవ‌ర్లు, క్యాబ్ డ్రైవ‌ర్లు క‌లిసారు. ఇప్పుడు అదే నేల‌.. అదే క్యాబ్, ఆటో డ్రైవ‌ర్ల న‌డుమ వారికి భ‌రోసా ఇస్తూ ఏడాదికి రూ.10వేల భ‌రోసాగా ఇస్తూ, ఐదేండ్ల‌లో రూ.50వేలు ఇస్తాన‌ని  మాటిచ్చి అమ‌లు చేశారు.. ఓసారి వెన‌క్కి వెళితే.. వైసీపీ నేత జ‌గ‌న్‌కు సంఘీభావం తెలిపారు. ఆనాడు ఏలూరు స‌భ‌లో మాటిచ్చాడు.. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ ఆనాడు స‌భ‌లోనే మాటిచ్చాడు.. అది పాద‌యాత్ర స‌భ‌.. ఆ స‌భ‌లో ఇచ్చిన హామీలు అమ‌ల‌వుతాయా.. పాడా.. అనుకున్నారంతా.. కానీ కాలం గిర్రున తిరిగింది. ఏడాదిన్న‌ర గ‌డిచింది.


ఆనాడు ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఇచ్చిన ఆ హామీ.. నేను అధికార ప‌క్ష నేత‌గా దాన్ని అమ‌లు చేశారు.. నేను చూసాను అని అన్నారు.. చూసిన దాన్ని నేను విన్నాను అన్నారు.. విన్న‌దాన్ని అమ‌లు చేశారు.. నేను ఉన్నాను అన్నారు.. అవును అంద‌రికి అండ‌గా అన్న‌లా.. త‌మ్ముడిలా అండ‌గా ఉన్నారు.. ఇదే ఆనాడు జ‌గ‌న్ చేసిన ప్ర‌మాణం.. నేను చూసాను.. అంటే మీ క‌ష్టాల‌ను చూసాన‌ని. నేను విన్నాను అంటే.. మీరు ప‌డుతున్న క‌ష్టాలు ఎలాంటివో మీ మాట‌ల ద్వారా విన్నాన‌ని.. నేను ఉన్నానంటే.. రాబోవు రోజులు మ‌న‌వే.. అప్పుడు మీకు సేవ చేసేందుకు ఆదుకునేందుకు నేను ఉన్నాన‌ని భ‌రోసా ఇచ్చారు.. దాన్ని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేశారు.


ఎక్క‌డైతే మాటిచ్చారో.. అక్క‌డే అమ‌లు చేసి మ‌రో చ‌రిత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు సీఎం జ‌గ‌న్‌. ఇచ్చిన మాట త‌ప్ప‌డం, విన్న క‌ష్టం తీర్చ‌డం.. భ‌రోసా ఇచ్చి ఆదుకోవ‌డంలోనే ఆనందాన్ని పొందుతుంది సీఎం జ‌గ‌న్ కుటుంబం. ఆది నుంచి అంతే.. ఆనాడు తాత వైఎస్ రాజారెడ్డి తన‌తోటి న‌డిచేవారికి అండ‌గా ఉండేవార‌ని ప్ర‌తీతి. త‌రువాత తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి న‌డిచిన తోవ‌.. చేసిన సేవ‌లు ప్ర‌త్య‌క్షంగా చూసి నేర్చుకుని ఇప్పుడు వాటిని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తూ తండ్రిని మించిపోతున్నారు జ‌గ‌న్‌.


నేడు ఏలూరులో వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించిన‌ సీఎం  జగన్ ఆనాటి హామీని అమ‌లు చేసి ఏనాడు ఇచ్చిన మాట త‌ప్పం..కాస్త ఆల‌స్యం కావొచ్చు గాక‌.. కానీ చేయ‌డం ప‌క్కా అంటూ సీఎం జ‌గ‌న్ నిరూపించుకున్నారు. దాదాపు ఏపీలోని 1,73,531మందికి అన్న‌గా, త‌మ్ముడిగా చేయూత ఇస్తూ, బ‌తుకు భ‌రోసా నిస్తూ ముందుకు సాగేందుకు శ్రీ‌కారం చుట్టారు.. ఏదేమైనా.. మాటిచ్చిన చోటే అమ‌లు చేయ‌డం అనేది అరుదుగా జ‌రుగుతుంది.. ఇచ్చిన‌మాట నిలుపుకోవ‌డం ఇంకా కాష్టం..కానీ హామి ఇచ్చిన చోట‌.. ఇచ్చిన హామీని నిలుపుకుని సీఎం జ‌గ‌న్ వారి పాలిట ప్ర‌త్య‌క్ష దైవ‌మ‌య్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: