ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఓ ఇంటర్ విద్యార్థి హల్ చల్ చేశాడు. ఓ కార్పొరేట్ కలశాలలో ఓ ఇంటర్మీడియేట్ విద్యార్థి డ్రగ్స్ మత్తులో వీరంగం సృష్టించాడు. పాటలు చెప్పే ఉపాధ్యాయుడినే కొట్టడానికి వెళ్ళాడు. ఆ కుర్రాడిని అడ్డుకోడానికి వెళ్లిన పోలీసులపైనా దాడికి దిగాడు.          


వివరాల్లోకి వెళ్తే .. ఈ ఘటన మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజారులో నడుస్తున్నఓ కార్పొరేట్‌ కళాశాలలో జరిగింది. ఆ ప్రాంతంలో కొంతమంది మాదక ద్రవ్యాలు అమ్ముతుండటంతో ఇంటర్ కాలేజీ విద్యార్థులు వారికీ అలవాటుపడ్డారు. ఈ సమయంలో ఈ నెల ఒకటో తారీఖున క్లాసు రూమ్‌లో మత్తులో జోగుతున్న ఓ విద్యార్థిని, ఇంగ్లీషు ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు మందలించారు.               


ఆ మందలింపుని మనసులో పెట్టుకున్న ఆ విద్యార్థి కాలేజీ అయ్యాక శ్రీనివాసరావుపై దాడికి ప్రయత్నించాడు. అతని కారుపై బండరాయి వేసి కారుని ధ్వసం చేశాడు. అతనిని కొట్టడానికి వెళ్ళాడు. అయితే ఈ సమాచారం పోలీసులకు అందడంతో అక్కడికి చేరుకొని విద్యార్థిని ఆపడానికి ప్రయత్నించారు.             


చివరికి విద్యార్థిని పట్టుకొని అతన్ని ఆసుపత్రికి తరలించి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. దీంతో అసలు విషయం బయటపడింది. దింతో ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ విద్యార్థి తల్లిదండ్రులు నిరసన తెలపడంతో అదేరోజు రాత్రి విద్యార్థిని ఇంటికి పంపారు.                


అయితే సాధారణంగా డిగ్రీ విద్యార్థులకు కూడా దొరకని డ్రగ్స్ ఇంటర్ కాలేజీలో ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నా పిల్లలకు ఎలా వచ్చాయని పోలీసులు విచారిస్తున్నారు. ఏది ఏమైనా ఇంటర్ పిల్లలు కూడా డ్రగ్స్ కి అలవాటు పడటం ఘోరం. 


మరింత సమాచారం తెలుసుకోండి: