సోషల్ మీడియా అంశం ఇప్పుడు టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఇటీవల టీడీపీ కార్యకర్తలను సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరు పార్టీ ఆఫీసులో మీడియాను పిలిచి.. ఏకంగా మూడు గంటలపాటు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీడీపీ నేతలపై పెడుతున్న సోషల్ మీడియా పోస్టులను చంద్రబాబు ప్రదర్శించారు.


అందులో ఒక పోస్టు టీడీపీ మహిళానేతలు ఉద్దేశించి పెట్టింది ఉంది. అందులో బూతులూ ఉన్నాయి. జగన్ నీ ఆస్తి.. దెం....డా అంటూ ఒక బూతు ఉంది. సాధారణంగా మీడియా సమావేశంలో బూతులు మాట్లాడరు. అందులోనూ చంద్రబాబు వంటి స్థాయి ఉన్న నేత వాటిని పలకరు. కానీ చంద్రబాబు ఆ పోస్టును యథాతథంగా చదివి వినిపించారు. దీంతో అంతా షాకయ్యారు.


టీవీలో ప్రత్యక్ష ప్రసారంలోనూ చంద్రబాబు నోట బూతు వచ్చేసింది. ఇప్పుడు దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఇప్పుడు వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలోని పోస్టింగ్‌లపై చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ పెట్టి అసభ్యకరమైన పదాలు చదువుతుంటే ప్రజలు చెవులు మూసుకుంటున్నారని వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పిన చంద్రబాబు మహిళలను కించపరిచేలా ఉన్న పదాన్ని చంద్రబాబు ఎలా పలికారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధారకర్ బాబు ప్రశ్నించారు.


చంద్రబాబు ప్రతి చోటు దొరికిపోయి సిగ్గుతో తలవంచుకొని ఇంట్లో కూర్చోకుండా ఎవరో పెట్టిన పోస్టును తీసుకువచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టి ఇంకా దిగజారిపోయాడన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రభుత్వ విధానాలపై మాట్లాడాలన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లుందని, దయచేసి ఒకసారి డాక్టర్లకు చూపించుకోవాలని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సూచించారు. ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూడడం, కొడుకు చేతగానివాడు కావడం, వయస్సు మీద పడడంతో మానసిక స్థితి దెబ్బతిన్నట్లు ఉండొచ్చన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: