అయ్య బాబోయ్‌... ఇప్పుడు బాబోరికి యురేనియం నిక్షేపాలు దొరికాయోచ్... అని పాట పాడుకుంటున్నారు టీడీపీ త‌మ్ముళ్ళు.. యురేకా.. మాకు బంగారం లాంటి యురేనియం ఆయుధాలు అందాయో అంటూ తెలుగు త‌మ్ముళ్ళు ఊగిపోతున్నారు.. ఇంత‌కు ఈ యురేనియం నిక్షేపాలు  ఏందీ.. బాబోరికి దొర‌క‌డం ఏందీ..? అంటే బాబోరికి యురేనియం నిక్షేపాలు త‌గిలాయా.. ఇక ఆయ‌నకు  రాజ‌కీయాల‌తో ప‌నిలేకుండా అయిందా.. ? అనే అనుమానాలు రావొచ్చు.. అది కాదండోయ్‌.. ఇంత‌కాలం బాబోరికి ఏపీ స‌ర్కారుపై ఉద్య‌మించ‌డానికి ఏమీ ఆయుధాలు దొర‌క‌లేద‌ట‌.. ఇప్పుడు యురేనియం నిక్షేపాల‌పై ఉద్య‌మించే అవ‌కాశం దొరికింద‌ట బాబోరికి. ఇక ముందుంది చూడు ముస‌ళ్ళ పండుగ అని పాట‌లు పాడుకుంటూ.. యురేనియం పై పోరుబాట ప‌ట్టేందుకు తెగులు ప‌ట్టిన తెలుగు త‌మ్ముళ్ళ‌ను తోడేసుకుని ముందుకు సాగ‌బోతున్నార‌ట బాబోరు.


అందుకే యురేనియంపై పోరు బాట ప‌ట్ట‌డానికి, ఏపీ ప్ర‌భుత్వానికి ఏమిటి సంబంధం అని ఎవ‌రైనా అడిగారో.. అది అంతే.. ఇక్క‌డ త‌వ్వ‌కాలు జ‌రుపుతున్నారంటే.. అది జ‌గ‌న్ చేస్తుందే అంటారు కానీ..అది కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన అనుమ‌తి అన‌రు క‌దా రంకు తెలిసిన బాబోరు.. అందుకే ఈరోజు యురేనియం తవ్వకాలపై బాబోరు ప్రెస్‌మీట్ పెట్టి బోరున విల‌పించారు.. యురేనియం త‌వ్వకాల‌కు, జ‌గ‌న్‌కు లింక్ పెడుతూ యురేనియం త‌వ్వకాల‌ను  వెంటనే ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలు జరుపుతుంటే... ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. యురేనియంపై తవ్వకాలకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి వైసీపీ నేతలు డుమ్మా కొట్టారని, ఆదివారం ఓబుళపల్లెలో జరిగే అఖిలపక్ష పోరాటానికి ప్రభుత్వ మద్దతు ఉందా? లేదా? అని ప్రశ్నించారు.


యురేనియం ప్లాంటుకు అనుమతులిచ్చి మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నల్లమలకు ముప్పు తెచ్చారని ఆరోపించారు. ఇప్పుడు సీఎం జగన్‌ రైతులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. అయితే ఇక్క‌డ బాబోరు చెపుతున్న లాజిక్ అర్థం కావడం లేదు.. ఎంటా లాజీక్ అంటే అస‌లు యురేనియం త‌వ్వ‌కాల‌కు అనుమ‌తులు ఇచ్చింది డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అట‌.. ఆయ‌న ఎప్పుడిచ్చారు.. వైఎస్సార్ త‌రువాత ఎన్ని ప్ర‌భుత్వాలు మారాయి.. ఎంత మంది సీఎంలు ప‌నిచేశారు.. అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ భౌగోళిక ప‌రిస్థితి అలాగే ఉందా.. లేక ఏమైనా మార్పులు చేర్పులు జ‌రిగాయా.. అది స‌రే గాని యురేనియం త‌వ్వ‌కాల‌కు జ‌గ‌న్ స‌ర్కారుకు సంబంధం ఉందా...?  జ‌గ‌న్ ప‌రిపాల‌న చేపట్టి కేవ‌లం నాలుగు నెల‌లే అవుతుంది క‌దా.. మ‌రి అంత‌క‌న్నా ముందు ఐదేండ్లు ప‌రిపాల‌న చేసిన బాబోరు ఎందుకు యురేనియం త‌వ్వకాల‌ను ఆప‌లేదు..


ఆయ‌న పాల‌న‌లో యురేనియం త‌వ్వ‌కాలు జ‌రుప‌లేదా...?  త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి వైఎస్సార్ సీఎంగా ఉన్న‌ప్పుడు  రైతులకు అన్యాయం జ‌రిగేలా  అనుమ‌తులు ఇస్తే.. అదే రైతులపై ప్రేమ ఉంటే..  బాబోరు ఎందుకు ర‌ద్దు చేయ‌లేదు..?  ఇప్ప‌డు జ‌గ‌న్ సీఎం కాగానే ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు..?  యురేనియం తవ్వ‌కాల‌తో న‌ల్ల‌మ‌ల కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు, సిని స్టార్లు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రౌండ్ టేబుల్ స‌మావేశం క‌న్నా ముందే ఎందుకు బాబోరు స్పందించ‌లేదు.. ఇంకా అనేక ప్ర‌శ్న‌లు సామాన్య జ‌నం మదిలో మెదులుతున్న ప్ర‌శ్న‌లు. ఇంకా చెప్పాలంటే.. అస‌లు యురేనియం త‌వ్వ‌కాలు అనేది కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోని ఆంశం.


అది రాష్ట్రంలోని ఆంశం కాద‌న్న విష‌యం పాల‌న చేసిన బాబోరికి తెలియదా.. ? ఐదేండ్లు అధికారం అనుభ‌వించి.. యురేనియం త‌వ్వ‌కాల‌ను అడ్డుకోలేని అస‌మ‌ర్థుడైన బాబోరు.. ఇప్పుడు రైతుల‌పై ప్రేమను ఒల‌క‌బోస్తూ... ల‌బోదిబో అంటే న‌మ్మ‌డానికి ఎవ్వ‌రు తేర‌గా లేర‌ని జ‌నాలు అనుకుంటున్నారు.. ఏదేమైనా బాబోరు తీసుకున్న యురేనియం ఉద్య‌మం బాబోరుకు బాగానే గిట్టుబాటు అవుతుందో లేదో కాల‌మే స‌మాధానం చెప్పాలి మ‌రి...!


మరింత సమాచారం తెలుసుకోండి: