ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ కలకలం రేపింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. ఈ మేరకు ఎంపీడీవో సరళ   ఎమ్మెల్యేపై కేసు కేసు పెట్టారు. అయితే దీనిపై స్పందించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... చట్టానికి ఎవరూ అతీతులు కాదని... తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయితే కోటం రెడ్డి ని అరెస్ట్ చేసి తీసుకెళ్లగా బెయిల్ పై  బయటకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. 

 

 

 

 

 ఈ కేసు విషయంలో పోలీసులు పూర్తిగా విచారణ జరిపించాలని కోరుకుంటున్నానాని కోటం రెడ్డి వ్యాఖ్యానించారు. తనపై కావాలని తప్పుడు కేసులు బనాయించారని కానీ తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని కోటంరెడ్డి తెలిపారు. అయితే జిల్లా ఎస్పీకి తనకు ఎన్నో రోజులుగా విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎన్నికల ముందు కూడా  తనను ఇబ్బంది పెట్టారని... ఇప్పుడు కూడా పెడుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. 

 

 

 

 

 అందుకే ఆదేశాలు వచ్చిన గంటలోపే విచారణ కూడా చేయకుండా అరెస్ట్ చేశారని... కనీసం ఫోన్ చేసి తెలుపిన  స్టేషన్ కు వెళ్లే వాడినని తెలిపిన కోటంరెడ్డి...  ఒక శాసన సభ్యుడుని అయినా తాను  ఎక్కడికి పారిపోతానని అంత హడావిడిగా   అరెస్టు చేశారంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛను నెల్లూరు పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. తనపై నమోదైన కేసు పై సరైన ఆధారాలు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలని తమ అధినేత ఆదేశించారని... ఇలా నిష్పక్షపాతంగా వ్యవహరించే  సీఎం జగన్ మోహన్ రెడ్డి  కలకాలం ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉండాలని కోటంరెడ్డి కోరుకున్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు అన్నది  తమ అధినేత,  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఉద్దేశమన్నారు కోటంరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: