ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి పట్టుదలకు వెళ్తున్నారు . సమ్మెలో పాల్గొంటే ... ఇక మీకు ఉద్యోగాలు ఉండవన్న హెచ్చరికల ద్వారా ఆయన పరోక్షంగా కార్మికులను  రెచ్చగొట్టారు .  దాంతో కార్మికులు కూడా ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పాలని భావిస్తున్నారు . అందుకే ప్రభుత్వ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా సమ్మెకు వెళ్లారు .  ముఖ్యమంత్రి హుంకరింపులకు  గుప్పెడు మంది కార్మికులు బెదరగా, వేలాది మంది కార్మికులు అమితుమీ కి సిద్ధమయి సమ్మె బాటపట్టారు  .


రాష్ట్ర వ్యాప్తంగా రెండవరోజూ ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది . ఒకవైపు పండుగ సీజన్ , మరొక వైపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక తల మీద ఉన్న సమయం లో నిన్న , మొన్నటి వరకు తమ వెంట ఉన్న  కార్మికులు  ఉన్నట్టుండి ధిక్కార ధోరణి ని ప్రదర్శించడం తో   కేసీఆర్ ఆహం దెబ్బతిన్నట్లు కన్పిస్తోంది .  అందుకే అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం లో సమ్మెకు వెళ్లిన కార్మికుల న్యాయమైన  కోర్కెల పై చర్చించకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది . ప్రభుత్వం ఎంతగా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని భావిస్తోన్న, క్షేత్రస్థాయి ఆ దిశగా  చర్యలు తీసుకోవడం లో అధికారులు విఫలమవుతున్నారు .


దీనితో సొంతూళ్లకు వెళ్లాలన్న వారికి ప్రైవేట్ బస్సు యజమానులు దోపిడీతో పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి . తెలంగాణ రాష్ట్రం లో ఏ ప్రాంతానికి ఆర్టీసీ బస్సులో  వెళ్లినా  గతం లో మహా అయితే  200 నుంచి 300  రూపాయలు ఖర్చు అయ్యేదనీ, కానీ ఇప్పుడు అదే ప్రాంతానికి వెళ్ళడానికి  మూడింతలు అధికంగా  ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు . ప్రభుత్వం వైఖరి వల్లే తమకు ఈ కష్టాలని వారు మండిపడుతున్నారు . ముఖ్యమంత్రి మొండిపట్టుదల వల్ల  అటు కార్మికులు , ఇటు ప్రయాణికుల నుంచి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవడం మినహా సాధించేది ఏమి కన్పించడం లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి . 


మరింత సమాచారం తెలుసుకోండి: