ముఖ్యమంత్రి అయినప్పటి నుండి జగన్ దూకుడు మామూలుగా లేదు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ కొత్త కొత్త స్కీములు మరియు అభివృద్ధి కార్యకలాపాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అతను ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల ప్రక్రియ చాలా వినూత్నమైనదిగా పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. మద్యం నిషేధానికి కీలకమైన అడుగులు వేయడం మరియు తన సొంత పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎక్కడా వెనక్కి తగ్గకుండా అతన్ని అరెస్టు చేయించడం వంటి ఎన్నో అబ్బురపరిచే సంఘటనలు మనం జగన్ ప్రభుత్వంలో చూశాం.

అయితే ఇప్పుడు వహ్వా.! జగన్ అని అనిపించేలా అతను మరొక మంచి పని చేశాడు. ఎన్నికలకు ముందు తాను హామీ ఇచ్చినట్లు నిరుద్యోగులైన యువతికి గ్రామ వాలంటీర్ల పోస్టులని కట్టబెడుతూ స్వాతంత్ర దినోత్సవం నుంచి జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నెలకు 5000 రూపాయలుగా ఉన్నవారు జీతం కాస్తా 8000 రూపాయలకి జగన్ పెంచేసాడు. వీలైనంత త్వరగా గ్రామ వాలంటరీ యొక్క ప్రిన్సిపాల్ సెక్రటరీ కలవనున్న జగన్ దీని అమలుకు వీలైనంత త్వరగా జరగాలని ఆదేశాలు ఇచ్చేశాడట.

జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రవేశపెట్టిన అభివృద్ధి స్కీములు ఇంటింటికి వెళ్లేలా చూసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ నియమించిన సంగతి తెలిసిందే. వారంతా రాష్ట్రంలోని గ్రామాలు, వార్డు మరియు పట్టణాల్లో నియమించబడ్డారు. గ్రామ వాలంటరీ పోస్టుకి అర్హత కోసం వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉండగా ఈ పోస్టు సాధించేందుకు ఆటవిక ప్రాంతాల్లో అయితే పదవ తరగతి మయుతు ఇంటర్మీడియట్ నుంచి ఇతర చోట్ల విద్యార్హతగా నిర్ణయించారు. కేవలం గ్రామ వాలంటీర్ల పైనే రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: