ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకోవాలి...ఇదే టార్గెట్ గా పెట్టుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నాలుగు నెలల కాలం పని చేశారు. సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు మేలు చేసే పథకాలు అందించడం, లక్షల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం...ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ చాలా పనులు చేశారు. ఇక తాజాగా తీసుకున్న ఒక నిర్ణయంతో ఆయన ఓ మెట్టు ఎక్కేశారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో ఎవరు తప్పు చేసిన చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పడం చాలా మంచి విషయం.


ఈ విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ఆరు నెలల్లో కాదు....నాలుగు నెలల సమయంలోనే మంచి సీఎం అనిపించుకునే స్టేజ్ కు చేరుకున్నారు. అయితే ఇంత మంచి పేరు వచ్చిన మంత్రులు కూడా సరైన పని తీరు కనబరిస్తే జగన్ కు ఇంకా తిరుగులేదనే భావన కలుగుతోంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని జగనే తన భుజాల మీద మోస్తున్నారు. ప్రభుత్వంలో ఎక్కువమంది మంత్రులు తమ తమ శాఖలపై కూడా సరైన పట్టు సాధించలేదు. కొత్తగా మంత్రులైన వారిలో కొంతమంది ఇంకా సెట్ కాలేదనిపిస్తోంది. అసలు కొందరు అయితే మంత్రులు అన్న సంగతి ప్రజలకు కూడా తెలియదనే చెప్పాలి.


అటు సీనియర్లలో కూడా ఇద్దరు, ముగ్గురు తప్ప మంచి పనితీరు కనబరచడం లేదు. ఒకవైపు జగన్ కష్టపడుతూ...ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటుంటే, మంత్రులు వాటిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారు. అలాగే టీడీపీతో సహ మిగతా ప్రతిపక్షాలు చేసే విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో కూడా వెనుకబడ్డారు. ఇకనుంచైనా మంత్రులు కష్టపడుతూ....జగన్ కు సపోర్ట్ గా నిలిస్తే బాగుంటుంది. మొత్తానికి మంత్రులు కూడా సెట్ అయిపోతే జగన్ కు తిరుగుండదు.



మరింత సమాచారం తెలుసుకోండి: