ఏపీలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వంలో సైలెంట్ గా తన పని చేసుకుని వెళ్లిపోతున్న మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజునే. మంత్రిగా పదవి చేపట్టి నాలుగు నెలలు గడిచిన చెరుకువాడ పెద్దగా హైలైట్ కాలేదనే చెప్పాలి. తొలిసారి మంత్రి పదవి చేపట్టిన చెరుకువాడ...2004లో కాంగ్రెస్ తరుపున అత్తిలి (నియోజకవర్గాల పునర్విభజనకు ముందు)నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత పితాని సత్యనారాయణని ఓడించి రికార్డు సృష్టించి తెలుగుదేశం కంచుకోటలో పాగా వేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చివరి నిమిషంలో శ్రీరంగనాథరాజుకు కేబినెట్‌లో బెర్తు ఖరారు చేశారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి చెరుకువాడ తన శాఖ పనులు చూసుకుంటూ ముందుకెళుతున్నారు. అయితే ప్రస్తుతాకైతే చెరుకువాడ తన శాఖలో అతి పెద్ద నిర్ణయాలు ఏమి తీసుకోలేదు.


త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశముంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే పనిలో ఉంది. ఉగాది నాటికి ఈ ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తిచేయనుంది. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశముంది. సుమారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 1.70 లక్షల ఇళ్లని నిర్మించడమే లక్ష్యంగా మంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


మొత్తం మీద మంత్రిగా రంగనాథరాజు పనితీరు అంతగా బాగోలేదని చెప్పాలి. అటు అధికార నేతగా చెరుకువాడ టీడీపీ చేసే విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొట్టిన సందర్భాలు కూడా పెద్దగా ఏమి లేవు. ఏదో ఆయన పని ఆయన సైలెంట్ చేసుకుని వెళ్లిపోవడం తప్ప...ఈ నాలుగు నెలల కాలంలో పెద్దగా చేసిందేమి లేదనే చెప్పొచ్చు. ఇక అటు నియోజ‌క‌వ‌ర్గంలో కాని... ఇటు జిల్లాలో కాని మంత్రిగా కూడా ఆయ‌న త‌న‌దైన ముద్ర వేయ‌డం లేదు. మ‌రి ఇక‌నైనా ఆయ‌న సీనియార్టీ చూపిస్తారేమో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: