తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేసిన మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సమ్మోలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలిగిస్తున్నట్టులు ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచాడు ముఖ్యమంత్రి కేసీఆర్.           

                   

ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెను మరింత ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులకు దైర్యం చెప్తూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ బహిరంగ లేఖ రాశాడు.  

                   

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లే నష్టాల్లో ఉందని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసమే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని జగన్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించొద్దని విజ్ఞప్తి చేశారు. డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించవద్దని అవసరమైతే మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని ఆర్టీసీ కార్మికులకు కార్యదర్శి జగన్ సూచించారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్. 

                                   

మరింత సమాచారం తెలుసుకోండి: