ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక...తీసుకున్న సంచలన నిర్ణయాల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు కూడా ఒకటి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చేయడమే లక్ష్యంగా జగన్ ప్రతి గ్రామ పంచాయితీలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి..అందులో వివిధ కేటగిరీలకు సంబంధించిన 11 మంది ఉద్యోగులు పనిచేసేలా ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి వీరి ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం, అందులో ఉద్యోగులని నియమించడం జరిగిపోయాయి.


ఇక ఇప్పటికే జగన్ గ్రామ సచివాలయాల రూపు రేఖలని మార్చేసిన విషయం తెలిసిందే. ప్రతి గ్రామ పంచాయితీకి వైసీపీ రంగులు వేసి సచివాలయంగా మార్చేసి కొత్త లుక్ వచ్చేలా చేశారు. ఈ క్రమంలోనే జగన్ సచివాలయాల్లో ఓ రూల్ ఫాలో అవుతున్నారు. జగన్ సీఎంగా అధికార పీఠం ఎక్కగానే నవరత్నాలకు సంబంధించిన  ప్రతి అంశాన్ని తన ఆఫీసులోని గోడలపై ఏర్పాటు చేసుకున్నారు.


అలాగే నవరత్నాలు ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ఉండాలని రూల్ పాస్ చేశారు. నవరత్నాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, మనం ఏమి అమలు చేస్తున్నామో ప్రజలకు కరెక్ట్ గా తెలియాలని జగన్ ఈ రూల్ పెట్టారు. మేనిఫెస్టోనే ఓ భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ఎప్పుడు చెప్పే జగన్...దాన్ని ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో కూడా ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో నవరత్నాలకు సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు.


మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఓటర్లు కూడా విస్మరించకూడదని, అందులోని అంశాలు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రతి క్షణం గుర్తుకు రావాల్సిన అవసరం ఉందని చెబుతూ...ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల్లో వాటి ఫ్లెక్సీలు తప్పనిసరి చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా జగన్ ఇలాంటి ఒక రూల్ పెట్టడం అభినందనీయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: