కేఈ కృష్ణమూర్తి.....తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత....ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసిన నాయకుడు. మాజీ ముఖ్యమంత్రులు టంగుటూరి అంజయ్య, ఎన్టీఆర్, చంద్రబాబుల క్యాబినెట్ లలో మంత్రిగా చేసిన కృష్ణమూర్తి...1978లో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పుడు జరిగిన ఎన్నికల్లో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1983లో కూడా అదే స్థానం నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరి 1985లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.


ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో విభేధాలు రావడంతో మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. 1989లో కాంగ్రెస్ తరుపున డోన్ నుంచి మరోసారి గెలిచారు. తర్వాత 1998లో మళ్ళీ కాంగ్రెస్ కు రాజీనామా చేసి అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ వెంటనే వచ్చిన 1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున కర్నూలు ఎంపీగా గెలిచిన కేఈ....2004లో ఓటమి పాలయ్యారు. మళ్ళీ 2009 లో డోన్ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన...2014లో పత్తికొండ అసెంబ్లీ నుంచి గెలిచి చంద్రబాబు క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా పని చేశారు.


ఇక మొన్న ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకుని కుమారుడు శ్యామ్ బాబుని పత్తికొండ బరిలో నిలపగా...ఘోరంగా ఓడిపోయారు. అటు కేఈ తమ్ముడు కేఈ ప్రభాకర్ కూడా వరుసగా రెండు సార్లు డోన్ నుంచి ఓడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేఈ పూర్తిగా రాజకీయాలకు దూరమైనట్లు కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడం...తప్ప పార్టీ కార్యక్రమాల్లో మాత్రం అడ్రెస్ లేరు. అటు కుమారుడు శ్యామ్ ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గం మొహం చూడటం లేదు.


ఇటు ప్రభాకర్ కూడా సైలెంట్ అయిపోయారు. కేఈ రాజకీయాలకు దూరం కావడంతో...కుటుంబం కూడా అంతగా యాక్టివ్ గా ఉండటం లేదు. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ఓ సీనియర్ నేత రాజకీయ శకం ఇంతటితో ముగిసినట్లే అనే చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: