ఆర్టీసీ కార్మికులను సమ్మె పురిగొల్పి..ఆ సాకుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే... వారి వద్దకు తెలంగాణ ద్రోహి పువ్వడ అజయ్ తో మాట్లాడించి వారు సమ్మెకు వెళ్లేలా ప్రభుత్వమే పురిగొల్పిందన్నారు రేవంత్ రెడ్డి.


కేసీఆర్ ప్రైవేటీకరణ మంత్రం వెనుక. ప్రభుత్వానికి మేఘా ప్రణాళిక ఉందన్న రేవంత్.. ఎలక్ట్రిక్ బస్ ల ద్వారా ప్రైవేట్ పరం చేసే కుట్ర ఉందన్నారు. ఎలక్ట్రిక్ బస్ లు గోల్డ్ స్టోన్ కంపెనీ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..“ తాము గద్దెనెక్కడానికి కేసీఆర్ కుటుంబం ఆర్టీసీ కార్మికులను ఉపయోగించుకున్నారు. గద్దెనెక్కాక వారిని విస్మరించారు. చట్ట ప్రకారం సమ్మె చేయడం కార్మికుల హక్కు. కార్మికులను కుక్కలతో పోల్చి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు.. డీజిల్ కు 27 శాతం వాట్ పన్ను ఆర్టీసీ కడుతోంది.


డీజిల్ పన్నులే ఏటా 700 కోట్లు ఆర్టీసీ చెల్లిస్తోంది.ధనికులు ప్రయాణించే విమానానికి ఉపయోగించే ఇంధన పన్నులను 16% నుంచి ఒక శాతానికి తగ్గించారు. ప్రజా రవాణా చేసే ఆర్టీసీ డీజిల్ పన్నులు తగ్గిస్తే రూ. 700 కోట్ల భారం తగ్గుతుంది. ప్రభుత్వం ప్రయాణికులకు ఇచ్చే రాయితీలు రూ. 700 కోట్లు చెల్లించకపోవడం కూడా నష్టాలకు కారణం. స్పేర్ పార్ట్స్ కోనుగోలుపై వేసిన అదనపు పన్నుల వల్ల రూ.150 కోట్ల భారం ఆర్టీసీ పై పడుతోంది.ఈ నష్టాలను పూడ్చే ప్రయత్నం చేయకుండా నష్టాల సాకుతో ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారు. గోల్డ్ స్టోన్ కంపెనీ కొనుగోలు చేసే బ్యాటరీ బస్ లను ఆర్టీసీలోకి తెచ్చి ప్రైవేటీకరణ చేయబోతున్నారు.


ఆర్టీసీ కి చెందిన 50 వేల కోట్ల విలువైన భూములను లీజుల పేరిట కేసీఆర్ బంధువులు తీసుకున్నారు. రెండు రోజులు రాని కార్మికుల ద్యోగాలు తొలగిస్తాం అంటున్నారు. ఆరు ఏళ్ళు సచివాలయానికి రాని కేసీఆర్ పై పీడీ ఆక్ట్ పెట్టి అండమాన్ జైల్ లో పెట్టాలా.. అని నిలదీశారు రేవంత్ రెడ్డి.తెలంగాణ కేసీఆర్ జాగీర్ కాదు... కార్మికులు మీకు బానిసల్లగా కనిపిస్తున్నారా.. 50 వేల మంది కార్మికులను రోడ్డున వేస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: