విజయదశమి రోజున జమ్మిచెట్టుని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. మరి ఎందుకు జమ్మి చెట్టును పూజిస్తారు.. అలా పూజించేటప్పుడు ఓ శ్లోకం చదువుతాు.. శమీ శమయతే అనే శ్లోకం తప్పక చదువుతారు.. జమ్మి పూజ, శ్లోకం వెనుక విషయం ఏంటి..? తెలుసుకుందాం..


జమ్మిచెట్టు విజయానికి సంకేతం. శమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసినట్లు రామాయణం ద్వరా తెలుస్తోంది. ద్వాపరయుగంలో అజ్ఞాత వాసానికి వెళ్లేముందు పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే ఉంచి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయ దశమినాడు ఉత్తర గోగ్రహణం కోసం అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించి గాండీవాన్ని ధరించి అద్భుత విజయాన్ని అందుకున్నట్లు మహాభారతం చెప్తోంది.


దసరా రోజు శమీ పూజ చేసేవారికి అమ్మవారి కృప లభించటమే గాక శనిదోష నివారణ జరుగుతుందట. దసరా సాయంత్రం వేళ ఆలయాలు, చెరువుల వద్ద ఉండే జమ్మి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షణలు చేస్తారు. శాస్త్రోక్తంగా జమ్మిని పూజించి జమ్మి ఆకును ప్రసాదంగా స్వీకరిస్తారు.


అందుకే సమయంలో ఈ శ్లోకం చదువుతారు.. "శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీఅర్జునస్య ధనుర్దారీ రామస్య ప్రియదర్శినిశమీ కమల పత్రాక్షి శమీ కంటక హారిణిఆరోగ్యంతు సదాలక్ష్మీ ఆయు: ప్రాణాంతు రక్షతుఆదిరాజ మహారాజ వనరాజ వనస్పతేఇష్ట దర్శన మృష్టాన్నం కష్ట దారిద్య్ర నాశనం"..


దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో శమీవృక్షమూ ఉంది. నాడు శమీవృక్షంతోబాటు ఆవిర్భవించిన తులసి, పారిజాత, బిల్వ వృక్షాలకు వనమాలి అనే ఓ అధిష్టాన దేవత ఉందనీ, ఆమెనే శమీ దేవత అంటారు. వినాయక పూజలో జమ్మి ఆకును ఉపయోగిస్తారు. త్రేతాయుగాన వనవాససమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: