మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక చిరు కొర‌టాల‌ శివ దర్శకత్వంలో తన నెక్ట్స్‌ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. దసరా రోజున ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరగనుంది. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఇప్పుడు బిజెపిలోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు ప్రస్తుతం టిడిపిలో ఉన్న ఓ మాజీ మంత్రి పావులు కదుపుతున్నారా ? అంటే ఏపీ రాజకీయ వర్గాల్లో అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి.


ఇంతకు చెరువును బిజెపిలోకి తీసుకు వెళుతున్న ఆ మాజీ మంత్రి ఎవరో కాదు గంటా శ్రీనివాసరావు. చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన గంటా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయం అప్పట్లో ప్రజారాజ్యంలో ఉన్న అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్ర‌జారాజ్యం కాంగ్రెస్‌లో కలవటానికి గంటా లాంటి నేతలే కారణమని విమర్శించిన సంగతి తెలిసిందే. ఇక ప్రతి ఐదేళ్లకు పార్టీ మారడం కామన్. ఆయన అధికారం ఎక్కడ ఉంటే ఆ గుడిలోనే ఉంటారన్న టాక్ ఉండ‌నే ఉంది.


ఐదేళ్లపాటు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు టిడిపికి దూరంగా జరిగి సైలెంట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రాజకీయంగా ఖాళీగా ఉన్న చిరంజీవిని వెంటేసుకుని బిజెపిలో చేరితే చిరంజీవికి ఏమోగానీ... తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న కోణంలో ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత గంటా టిడిపికి.. చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. వైసిపి సర్కార్ పై టిడిపి నేతలు ఎన్ని పోరాటాలు చేస్తున్నా గంటా మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.


ప్ర‌స్తుతం పార్టీ మారినా గంటాపై వేటు ప‌డుతుంద‌న్న ఉద్దేశంతోనే ఆయ‌న ఆచితూచి వ్య‌వ‌హరిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం చిరుకు మాత్రం రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేదు. ఆయ‌న సినిమాలు వ‌రుస‌గా చేసుకుంటూ వెళుతున్నారు. గంటా మాత్రం ప్ర‌త్యేక విమానాల్లో చిరుతో పాటు క‌లిసే వెళుతున్నారు. ఎక్కువుగా ఆయ‌న‌తోనే టైం స్పెండ్ చేస్తున్నారు. చిరు ఇమేజ్‌ను వాడుకుని బీజేపీలోకి జంప్ చేసి అక్క‌డ మ‌ళ్లీ ఏదో ఒక ప‌ద‌వి కొట్టే ప్లాన్‌లోనే గంటా ఇదంతా చేస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినప‌డుతున్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: