మాములుగా పక్షలు ఒకటి రెండు రకాలుగా అరుస్తుంటాయి.  ఇంకా చెప్పాలి అంటే.. మరో రెండు మూడు రకాల సౌండ్స్ మాత్రమే చేయగలుగుతాయి.  కానీ, లైర్ అనే పక్షి మాత్రం ఏకంగా 30 రకాలకుపైగా శబ్దాలు చేస్తుందట.  ఇలా రకరకాల శబ్దాలు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ లైర్ పక్షిపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి.  కానీ, ఆ పక్షి ఎలా అరుస్తుంది అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.  


ఇప్పటికి అది సస్పెన్స్ గానే మారిపోయింది.  ఇటీవలే ఓ వ్యక్తి ఆ పక్షి అరుస్తుండగా ఓ వీడియో తీశారు.  ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఆ వీడియో ఇప్పుడు సోషల్ ఇండియాలో వైరల్ అయ్యింది.  విజిల్స్, బుల్లెట్ సౌండ్స్, కెమెరా షట్టర్, కారం అలారం, లేజర్ కిరణాలు, గన్ ట్రిగ్గర్, మెషిన్ గన్ ఫైరింగ్, యుద్ధ ట్యాంకర్, టీవీ పాడైపోయినట్టుగా శబ్దాలు చేస్తోంది.  ఇలా ఎలా శబ్దాలు చేస్తోంది అనే విషయాలను మాత్రం ఎవరు కనుగొనలేకపోయారు.  


ఒక్కోజాతి పక్షులు ఒక్కోరకంగా ప్రవర్తిస్తుంటాయి.  పక్షుల బాడీ తీరు ఉంటుంది.  పక్షుల బాడీ తీరును బట్టి వాటి నుంచి వచ్చే అరుపులు ఉంటాయి. ఈ పక్షిపై ఇప్పటి వరకు ఎన్నో రకాల పరిశోధనలు చేశారు.  ఇంకా చేస్తూనే ఉన్నారు.  అయితే, ఈ పక్షులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.  అరుదైన పక్షిజాతికి చెందిన ఈ లైర్ పక్షి ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.  


ఇప్పటికి దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.  ఇవి సాధారణంగా చిన్న చిన్న కీటకాలను, కాక్రోచ్ లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి.  ఆహరం తీసుకునే సమయంలో ఇవి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి.  వీటి ప్రవర్తనను బట్టి వాటి మూడ్ ను అర్ధం చేసుకోవాలి.  లేదంటే ఇబ్బందులు వస్తాయట.  హ్యాపీగా ఉన్నప్పుడు ఒకలా, విచారంగా ఉన్నప్పుడు మరోలా, జంటకు మరోలా ఇవి ప్రవర్తిస్తుంటాయి.  ఈ లైర్ బర్డ్స్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తూ ఉండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: