జూపూడీ ప్ర‌భాక‌ర్ రావు. రాజ‌కీయాల గురించి తెలిసిన వారికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జూపూడి ప్రభాకర్ రావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే...ఆ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆయ‌న జూపూడి ప్రభాకర్ రావు అనంత‌రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయ‌న తాజాగా మ‌ళ్లీ వైసీపీలో చేరారు.

 

 
అయితే, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఈ సంద‌ర్భంగా జూపూడీ ప్ర‌భాక‌ర్‌రావు ప్ర‌శంస‌లు కురిపించారు. త‌న వైపు నుంచి పొరపాట్లు జరిగాయని, అవి సరిదిద్దుకునే క్రమంలో నేను దసరా సందర్భంగా మళ్ళీ పార్టీలో చేరాను. ``అసెంబ్లీలో పెట్టిన బిల్లులు కానీ నవరత్నాలు కానీ చూస్తే దాదాపు 85 శాతం మంది బడుగు, బలహీనవర్గాలు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి పాలన మళ్ళీ వస్తుందని భావించారు. జగన్‌ గారు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అనేక భాదలు చవిచూశారు. మేం తప్పిపోయిన గొర్రెల్లాగా అటూ ఇటూ పోయి ఉండొచ్చు. నిర్మొహమాటంగా చెప్తున్నా. ఈ ఇరువురి నాయకుల బృందంతో రాష్ట్రం అభివృద్ది వైపు సాగుతోంది. ఈ నేపధ్యంలో నాయకులంతా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక్క నిముషం కూడా ఆలస్యం చేయవద్దని, ఎలాంటి షరతులూ లేకుండా, ఒక సామాన్య కార్యకర్తలా పార్టీలో చేరాను.`` అని తెలిపారు.

 

 
ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపైనే కాకుండా...ఆయ‌న న‌మ్మిన‌బంటుగా పేరున్న ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డిపై సైతం ప్ర‌శంస‌లు కురిపించారు. ఆంధ్ర ఐరన్‌మ్యాన్ అని కొనియాడారు. ``జ‌గ‌న్‌ గారు ఒకవైపు, మరోవైపు ఆంధ్రా ఐర‌న్‌మ్యాన్‌గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి వ‌ల్ల అభివృద్ధి ప‌థంలో రాష్ట్రం సాగుతోంది``అని కొనియాడారు.
ఇక ఆకుల స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ``మ్యానిఫెస్టోని ప్రింట్‌ చేసి గోడలపై అతికించి ధైర్యంగా ఏదైతే మాట ఇచ్చారో అది చేయడానికి ముందుకెళుతున్న తరుణంలో మనం కూడా అందులో భాగస్తులైతే బావుంటుంది అన్న ఉద్దేశ్యంతో నేను ఇవాళ పార్టీలో చేరాను``. అని తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: