తలసాని శ్రీనివాస్ యాదవ్....తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత. అప్పుడు ఉమ్మడి ఏపీలో గానీ...ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో గానీ విజయవంతమైన నాయకుడుగా ఎదిగారు. గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు. అయితే తలసాని తాను రాజకీయాల్లో సక్సెస్ అయినట్లే కుమారుడు సాయి కిరణ్ ని కూడా రాజకీయాల్లో నాయకుడుగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మొదట్లోనే తలసాని ప్రయత్నాలు బెడిసికొట్టేశాయి.


లోక్ సభ ఎన్నికల ముందు వరకు తలసాని సేవాసమితి పేరుతో కార్యక్రమాలు చేస్తున్న తనయుడు సాయి కిరణ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కేసీఆర్ ని రిక్వెస్ట్ చేసుకుని సికింద్రాబాద్ లోక్ సభ స్థానాన్ని కుమారుడుకు కేటాయించేలా చేశారు.  ఇక టికెట్ దక్కక అటు కుమారుడు గానీ, ఇటు తలసాని గానీ అత్యుత్సాహం ప్రదర్శించి సికింద్రాబాద్ మాదే అని ముందే డప్పుకొట్టారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే సాయి కిరణ్ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కూడా అయిపోయారు.


అయితే కుమారుడు ఓడిపోయిన తలసాని తన ప్రయత్నాలు ఆపలేదు. కుమారుడుకు  మరో ఛాన్స్ ఇవ్వాలని కేటీఆర్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరలో జరగనున్న జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో మేయర్ గా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ తలసాని కోరికపైన కేటీఆర్ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. పైగా జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలామంది ఆశావాహులు అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు.


ఒకవేళ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ అడగకుండా ఉండుంటే సాయి కిరణ్ కు...కేటీఆర్ జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చేవారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అప్పుడు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం వల్ల...ఇప్పుడు జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో తలసాని వారసుడుకు అవకాశం దక్కకపోవచ్చు. మొత్తానికి తలసాని తనయుడు ఫ్యూచర్ రెండిటికి చెడ్డ రేవడిలా తయారైంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: