గత మే నెలలో వచ్చిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 175 సీట్లకి గాను ....151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ 151 సీట్లు గెలుచుకున్న...మరో 24 సీట్లలో ఓటమి పాలైంది. ఆ సీట్లలో టీడీపీ నేతలకు ఉన్న బలం కావొచ్చు...సొంత తప్పిదాలు వల్ల కావొచ్చు...వైసీపీ ఆ స్థానాల్లో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఈస్ట్ లో టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. అక్కడ వైసీపీ తరుపున బొప్పన రవికుమార్ పోటీ చేసి ఓడిపోయారు.


అయితే సీనియర్ నేత యలమంచి రవిని కాదని, బొప్పనకు టికెట్ ఇవ్వడం వల్లే ఓటమి పాలైనట్లు జగన్ ఓ అంచనాకొచ్చారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వైసీపీ తరుపున విజయవాడ ఎంపీగా పోటీ చేసిన పీవీపీ ఒత్తిడి కారణంగానే జగన్, రవిని పక్కనబెట్టి బొప్పనకు సీటు ఇచ్చి తప్పు చేశారు. అందుకే బొప్పనకు సరైన ఫాలోయింగ్ లేకపోవడం వల్ల ఓటమి పాలయ్యారు.


అదే మంచి ఫాలోయింగ్, అనుభవం ఉన్న యలమంచికి టికెట్ ఇస్తే ఫలితం వేరేగా వచ్చేది. బొప్ప‌న‌ది వాస్త‌వంగా కార్పొరేట‌ర్ స్థాయి.. అయినా జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ర‌వికి మాట ఇచ్చినా చివ‌ర్లో వ‌చ్చిన ఒత్తిడి మేర‌కు బొప్ప‌న‌కే సీటు ఇవ్వ‌గా ఆయ‌న స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఆ తప్పుని జగన్ సరిదిద్దుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం విజయవాడ ఈస్ట్ కు ఇన్ చార్జ్ గా కొనసాగుతున్న బొప్పనకు జగన్ ఎర్త్ పెట్టడానికి సిద్ధమయ్యారని సమాచారం.


ఆయన్ని తప్పించి ఆ స్థానంలో యలమంచి రవికి ఇన్ చార్జ్ పగ్గాలు ఇవ్వాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం జరుగుతుందని విజయవాడ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీనియర్ నేతగా ఉన్న యలమంచికి పగ్గాలు అప్పగిస్తే పార్టీని సమర్ధవంతంగా నడిపిస్తారని జగన్ భావిస్తున్నారు. అందుకే బొప్పనకు ఎర్త్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: